క్రీడాభూమి

ఆసియా బాడ్మింటన్ క్వార్టర్స్‌కు సైనా, సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉహాన్ (చైనా): ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా కేవలం 38 నిమిషాల్లోనే తన ప్రత్యర్థి, కొరియా క్రీడాకారిణి కిమ్ గా యున్‌ను 21-13, 21-13 తేడాతో చిత్తుచేసింది. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె సెమీ ఫైనల్‌లో స్థానం కోసం మూడో సీడ్ అకానే యమాగుచీ (జపాన్)ను ఢీ కొంటుంది. అంతకు ముందు జరిగిన మరో మ్యాచ్‌లో సింధు 21-15, 21-19 స్కోరుతో చౌరున్నీసా (డోనేషియా)ను 33 నిమిషాల్లోనే ఇంటిదారి పట్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న సింధు క్వార్టర్ ఫైనల్స్‌లో చైనా క్రీడాకారిణి కాయ్ యాన్యాన్‌తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. హాంకాంగ్ ఆటగాడు ఇంగ్ క లాంగ్ ఆన్గస్‌ను 21-12, 21-19 తేడాతో ఓడించిన అతనికి క్వార్టర్స్‌లో కఠిన పరీక్ష ఎదురుకానుంది. సెమీస్ చేరాలంటే అతను రెండో సీడ్ షి యుకీ (చైనా)తో తలపడాల్సి ఉంటుంది.
ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించిన షి యుకీతో పోరు సమీర్‌కు అనుకున్నంత సులభం కాదన్నది వాస్తవం. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన ఉత్కర్ష్ అరోరా, కరిష్మా వాడ్కర్ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించారు. వీరిపై హఫీజ్ ఫైజల్, క్లోరియా ఎమాన్యుయెల్ సభ్యులుగా ఉన్న ఇండోనేషియా జోడీ 21-10, 21-15 ఆధిక్యంతో గెలుపొందింది. మరో భారత జోడీ వెంకట్ గౌరవ్ ప్రసాద్, జూహీ దేవాంగన్ సైతం పరాజయంపాలైంది. వీరిపై రెండో సీడ్ ఇల్యు వాంగ్, డాంగ్‌పపింగ్ హువాంగ్ జోడీ 21-10, 21-9 స్కోరుతో సునాయాసంగా గెలిచింది.