క్రీడాభూమి

సౌరెజ్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, మే 15: స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ ‘లా లిగా’ టైటిల్‌ను బార్సిలోనా కైవసం చేసుకుంది. గ్రనడాతో జరిగిన మ్యాచ్‌ని 3-0 తేడాతో గెల్చుకొని, మొత్తం 91 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. లూయిస్ సౌరెజ్ హ్యాట్రిక్‌తో రాణించి బార్సిలోనాకు టైటిల్‌ను సాధించిపెట్టాడు. ఈ టోర్నీలో బార్సిలోనా విజేతగా నిలవడం ఇది 24వ సారి. మ్యాచ్ 22వ నిమిషంలో తొలి గోల్ చేసిన సౌరెజ్ 38వ నిమిషంలో రెండో గోల్ సాధించి, బార్సిలోనాకు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత గ్రనడా గోల్స్ కోసం పోరాటం సాగించగా, బార్సిలోనా రక్షణాత్మక విధానాన్ని అనుసరించి, ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంది. మ్యాచ్ ముగింపు దశకు చేరుకున్నప్పుడు సౌరెజ్ మరో గోల్‌తో హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. రియల్ మాడ్రిడ్ 90 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి పడిపోగా, ఒక పాయింట్ ఎక్కువ ఉన్న బార్సిలోనాకు టైటిల్ దక్కింది. అట్లెటికో మాడ్రిడ్ 88 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇలావుంటే, చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో రియల్ మాడ్రిడ్ 2-0 తేడాతో డెపోర్టవో లా కొరునాను ఓడించింది. క్రిస్టియానో రొనాల్డో 7, 25 నిమిషాల్లో గోల్స్ చేసి జట్టును గెలిపించినప్పటికీ, టైటిల్‌ను అందించలేకపోయాడు. అట్లెటికో బిల్బావో 3-1 తేడాతో సెవిల్లాపై గెలిచింది. అట్లెటికో మాడ్రిడ్ 2-0 స్కోరుతో సెల్టా విగోపై విజయాన్ని నమోదు చేసింది.

హ్యాట్రిక్‌తో బార్సిలోనాను గెలిపించిన సౌరెజ్. మెస్సీ లాంటి సూపర్ స్టార్ విఫలంకాగా, సౌరెజ్ విజృంభించడం విశేషం.
డక్‌వర్త్ లూయిస్ విధానం