క్రీడాభూమి

పరమ చెత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 15: వర్షం కురిసి ఆటకు అంతరాయం ఏర్పడినప్పుడు విజేతను నిర్ణయించడానికి లేదా లక్ష్యాన్ని నిర్ధారించడానికి అనుసరిస్తున్న డక్‌వర్త్ లూయిస్ విధానంపై రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టెఫెన్ ఫ్లెమింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిని మించిన పరమ చెత్త విధానం మరొకటి లేదని వ్యాఖ్యానించాడు. ఐపిఎల్‌లో భాగంగా శనివారం రైజింగ్ పుణె, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. రైజింగ్ పుణె 17.4 ఓవర్లలో ఆరు వికెట్లకు 103 పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. వర్షం తగ్గిన తర్వాత ఆటను కొనసాగించాలని నిర్ణయించిన అధికారులు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని అనుసరించి కోల్‌కతా లక్ష్యాన్ని 9 ఓవర్లలో 66 పరుగులుగా నిర్ణయించారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే కోల్‌కతా లక్ష్యాన్ని ఛేదించి, ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 12 మ్యాచ్‌ల్లో తొమ్మిదో పరాజయాన్ని చవిచూసిన రైజింగ్ పుణె నాకౌట్ అవకాశాలను కోల్పోయింది. కాగా, ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని నిర్ధారించడానికి అనుసరించిన డక్‌వర్త్ లూయిస్ విధానంపై ఫ్లెమింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది సరైన విధానం కాదని తాను చాలాకాలంగా చెప్తునే ఉన్నానని అన్నాడు. ఏ మ్యాచ్‌నైనా మొదటి నుంచి ఈ విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఆడడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పాడు. శాస్ర్తియంగా నిరూపితమైన సిద్ధాంతాలతో కూడిన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. డక్‌వర్త్ లూయిస్ విధానానికి శాస్ర్తియత లేదని స్పష్టం చేశాడు. క్రికెట్‌లో, ప్రత్యేకించి టి-20 ఫార్మెట్‌లో ఈ విధానాన్ని అమలు చేయవద్దని అతను అధికారులను కోరాడు.