క్రీడాభూమి

ఉబెర్ కప్ బాడ్మింటన్.. భారత్ చేతిలో ఆసీస్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కున్హాన్ (చైనా), మే 16: మహిళల బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్ ఉబెర్ కప్ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. పురుషుల విభాగంలో థామస్ కప్ కోసం జరుగుతున్న పోరులో మొదటి రోజున థాయిలాండ్‌తో తలపడిన భారత్ 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కోగా, మహిళల జట్టు 5-0 తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేయడం విశేషం. సైనా నెహ్వాల్, పివి సింధుతోపాటు గద్దె రిత్విక కూడా అసాధారణ ప్రతిభ కనబరచగా, డబుల్స్ విభాగంలో సిక్కీ రెడ్డి/ పివి సింధు, జ్వాలా గుత్తా/ అశ్వినీ పొన్నప్ప తమతమ ప్రత్యర్థులను ఓడించారు. సైనా 21-14, 22-20 తేడాతో సుయాన్ యూ చెన్‌పై గెలిచింది. మొదటి సెట్‌ను సులభంగానే పూర్తి చేసిన సైనాకు రెండో సెట్‌లో సుయాన్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే, అంతర్జాతీయ బాడ్మింటన్‌లో అపారమైన అనుభవం ఉన్న సైనా ఆ సెట్‌ను కష్టం మీద సాధించింది. పివి సింధు 21-11, 21-12 స్కోరుతో జోయ్ లయ్‌ను కేవలం 25 నిమిషాల్లోనే ఓడించింది. రిత్విక 21-11, 21-5 ఆధిక్యంతో టిఫానీ హోపై గెలుపొందింది. సిక్కీ రెడ్డి/ సింధు జోడీ 21-12, 21-12 తేడాతో జోయ్ లయ్/ లియెనే్న ఛూ జోడీపై విజయాన్ని నమోదు చేసింది. చివరి డబుల్స్‌లో జ్వాలా గుత్తా/ అశ్వినీ పొన్నప్ప జోడీ 21-15, 21-9 తేడాతో సుయాన్ యూ చెన్, గ్రోన్యా సమర్విల్లె జోడీపై గెలిచింది. మొత్తం ఐదు మ్యాచ్‌లనూ తన ఖాతాలో వేసుకున్న భారత్ 5-0 తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది.
ఉబేర్ కప్ పోరులో భాగంగా సోమవారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో థాయిలాండ్ 5-0 తేడాతో బల్గేరియాను ఓడించగా, ఇండోనేషియా 3-2 ఆధిక్యంతో హాంకాంగ్‌పై గెలిచింది. దక్షిణ కొరియా 5-0 స్కోరుతో మారిషస్‌పై విజయం సాధించింది. కాగా, పురుషుల విభాగంలో థామస్ కప్ కోసం జరిగిన మ్యాచ్‌ల్లో డెన్మార్క్ 5-0 ఆధిక్యంతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. జపాన్ ఇదే తేడాతో మెక్సికోపై విజయభేరి మోగించింది. జర్మనీపై మలేసియా, న్యూజిలాండ్‌పై చైనీస్ తైపీ కూడా 5-0 తేడాతోనే విజయాలను నమోదు చేశాయి.

chitram సైనా నెహ్వాల్, పివి సింధు