క్రీడాభూమి

చెలరేగిన కోహ్లీ, డివిలియర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 16: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన ఐపిఎల్ గ్రూప్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తయింది. బెంగళూరు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 183 పరుగులు చేయగలిగింది. అయితే, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైంది. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోగా, అతనికి మద్దతుగా డివిలియర్స్ నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 11.1 ఓవర్లలో అజేయంగా 115 పరుగులు జోడించి, బెంగళూరుకు తిరుగులేని విజయాన్ని అందించారు. ఛేజింగ్‌లో కేవలం ఒక వికెట్ కోల్పోయ భారీ తేడాతో నెగ్గిన జట్ల జాబితాలో బెంగళూరు రెండో స్థానాన్ని ఆక్రమించింది. 2012లో దక్కన్ చార్జర్స్‌పై ఢి ల్లీ డేర్‌డెవిల్స్ ఒక వికెట్ నష్టానికి 188 పరుగులు చేసి, గెలి చింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఒక వికెట్ చేజార్చుకొ ని 186 పరుగులు చేసి నైట్‌రైడర్స్‌పై విజయభేరి మోగించింది.
టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ గంభీర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీనితో మొదట బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు సాధించింది. గంభీర్ 34 బంతుల్లో, ఏడు ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి రనౌట్‌కాగా, మనీష్ పాండే 35 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు సాధించి శ్రీనాథ్ అరవింద్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్ అందించి వెనుదిరిగాడు. చివరిలో ఆండ్రె రసెల్ 39 (19 బంతులు, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), షకీబ్ అల్ హసన్ 18 (11 బంతులు, ఒక ఫోర్, ఒక సిక్స్) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. బెంగళూరు బౌలర్ అరవింద్ 41 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు.
నైట్‌రైడర్స్‌ను ఓడించేందుకు 184 పరుగులు చేయాల్సి ఉండగా, కోహ్లీ, క్రిస్ గేల్ బెంగళూరు ఇన్నింగ్స్‌కు గట్టిపునాది వేశారు. మొదటి వికెట్‌కు 71 పరుగులు జోడించిన తర్వాత సునీల్ నారైన్ బౌలింగ్‌లో గేల్ ఎల్‌బిగా వెనుదిరిగాడు. అతను 31 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 49 పరుగులు సాధించాడు. 2013 ఐపిఎల్ సీజన్‌లో 733 పరుగులు చేసి మైక్ హస్సీ ఒక సీజన్‌లో అత్యధిక పరుగులకు నెలకొల్పిన రికార్డును గేల్ అధిగమించాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన డివిలియర్స్‌తో కలిసి కోహ్లీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఆడాడు. అతను చెలరేగిపోయి బ్యాటింగ్ చేయగా, నైట్‌రైడర్స్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. డివిలియర్స్ 31 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 59 పరుగులు చేయగా, కోహ్లీ 51 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. అతని స్కోరులోనూ ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరూ రెండో వికెట్‌కు అభేద్యంగా 115 పరుగులు జోడించి బెంగళూరును గెలిపించారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఈ విజయంతో బెంగ ళూరు ప్లేఆఫ్ ఆశలు మళ్లీ చిగురించాయ.

చిత్రం విరాట్ కోహ్లీ (51 బంతుల్లో 75)