క్రీడాభూమి

గెలుపెవరిదో?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. నేడు హైదరాబాద్ వేదికగా ఉప్పల్ మైదా నంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, మాజీ చాంపియన్ ముంబయ ఇండి యన్స్ తలపడనున్నాయి. ముంబైతో జరిగి మొదటి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఓడిన చెన్నై, ఢిల్లీతో జరిగిన రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
వెంటాడుతున్న ఓటమి..
ఐపీఎల్‌లో ధోనీ జట్టుకు తిరుగులేదు. అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ లైనప్ బలంగా ఉండడంతో చెన్నైతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు తగిన ప్రణా ళికలతో సిద్ధం కావాల్సిందే. అంతటి బలీయ మైన జ ట్టును ఓటమి వెంటాడుతోంది. ముంబయి తో మ్యాచ్ అంటేనే చాంపియన్ల పోరు. ఈ పోరు ప్రతీసారి హోరాహోరీగా జరగడమే కాకుండా అసలైన టీ20 మజాని అభిమాను లకు పంచనుంది. అయతే ఐపీఎల్ ప్రారం భం నుంచీ తలపడ్డ ఈ రెండు జట్లలో ముం బయి జట్టే పైచేయగా సాధిస్తూ వస్తోంది.
ఈ సీజన్‌లో మూడు..
ఈ సీజన్ ఐపీఎల్‌లో ధోనీ సేనపై రోహిత్ జట్టు ఏకంగా మూడు మ్యాచ్‌లు గెలిచింది. రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ముంబయి ఇండియ న్స్ వరుసగా 37, 46 పరుగుల తేడాతో గెలు పొందగా, మొదటి క్వాలిఫయంగ్ మ్యాచ్‌లో మాత్రం మరో తొమ్మిది బంతులు మిగిలి ఉం డగానే, 6 వికెట్ల తేడాతో నెగ్గి నేరుగా ఫైనల్ చేరుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓవరాల్‌గా 29 మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు తలపడగా ముంబయి 17 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ 12 సార్లు గెలిచాయి. ఇందులో చెన్నై వేదికగా 8 మ్యాచ్‌లు జరగ్గా ముంబయి 6, చెన్నై 2 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ముంబయి వేదికగా 12 మ్యాచ్‌ల్లో తలపడగా ముంబయి 7, చెన్నై 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయ. ఇక ఇతర వేదికల్లో 9 మ్యాచ్‌ల్లో పోటీపడగా ముంబయి నాలుగు సార్లు, చెన్నై ఐదు సార్లు గెలుపొందింది.
అన్ని విభాగాల్లో ముంబయి భేష్..
గత మ్యాచ్‌ల ఆధారంగా చూస్తే ముంబయి జట్టు ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, మరో ఓపెనర్ క్వాంటన్ డీకాక్, సూర్య కుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్‌తో పాటు ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య సరైన సమయంలో రాణిస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగం లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్, లసిత్ మలింగ జయంత్ జయదేవ్ చెప్పు కోదగిన స్థాయిలో ఆకట్టుకుంటున్నారు. ఓపెనర్ క్వాంటన్ డీకాక్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లాడి 500 పరుగులు చేసి జట్టులో మొదటి స్థానంలో నిలిచాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు న్నాయి.
మిస్టర్ కూల్ ఒక్కడే..
చెన్నై జట్టులో మంచి హిట్టర్లున్నా ఈ సీజన్‌లో మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే చెప్పుకోదగిన స్థాయిలో రాణించాడని చెప్పాలి. మొత్తం 14 మ్యాచ్‌లాడిన ధోనీ 414 పరుగులు చేసి జట్టులో టాప్‌లో కొనసాగుతున్నాడు. షేన్ వాట్సన్, సురేశ్ రైనా అంబటి రాయుడు, ఫాఫ్ డుప్లెసిస్‌లు నామమాత్రంగానే రాణిస్తున్నా, కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్నారు. ఇక బౌలింగ్‌లో ఇమ్రాన్ తాహీర్, హర్భజన్‌సింగ్, ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తమ స్థాయి తగినట్లు ఆడుతున్నారు. బౌలిం గ్‌లో పూర్తిగా స్పిన్నర్లపైనే ఆధారపడడంతో వికెట్లు పడుతున్నా పరుగులు మాత్రం ధారాలంగా సమర్పించుకుంటున్నారు.
*
ఈ సీజన్ ఐపీఎల్ టోర్నీని ఈ రెండు జట్లలో
ఏ జట్టు గెలిచినా అది నాలుగో సారి టోర్నీ సాధించినట్లవుతోంది. గతంలో చెన్నై 2010, 2011, 2018లో టైటిళ్లు గెలుచుకోగా, ముంబయి 2013, 2015, 2017లో చాంపియన్‌గా నిలిచింది. రన్నరప్‌గా చెన్నై నాలుగు సార్లు (2008, 2012, 2013, 2015) నిలవగా, ముంబయి 2010లో మాత్రమే రన్నరప్‌గా నిలిచింది.
*
మొత్తం
మ్యాచ్‌లు: 69
మొదట బ్యాటింగ్ చేసి
గెలిచిన జట్లు: 32
మొదట బౌలింగ్ చేసి
గెలిచిన జట్లు: 35

*
సమయం: 7:30 గంటలకు (రాత్రి)