క్రీడాభూమి

ధనాధన్ క్రికెట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: ధనాధన్ క్రికెట్‌లో ప్రేక్షకులకు ఐపీఎల్ పంచే పరుగుల విందు అంతింత కాదు. ఈ పొట్టి ఫార్మాట్‌లో జట్టేదైనా అభిమానులు కోరుకునేది అదే. తమ అభిమాన క్రికెటర్లు కొట్టే ప్రతి బౌండరీని రికార్డుల్లో చూసుకుంటూ మురిసిపోతుంటారు. ఈ క్రమంలోనే ఈ సీజన్ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు, సిక్సర్లు, వేగవంతమైన సెంచరీ, అర్ధ సెంచరీలను ఒక్కసారి పరిశీలిద్దాం..
ఈ సీజన్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీని ముంబయ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య నమోదు చేశాడు. ఈడెన్ గార్డెన్స్‌లో ఏప్రిల్ 28న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్య ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో రిషభ్ పంత్ (18), కేఎల్ రాహుల్ (19), అండ్రూ రస్సెల్ (21), కీరన్ పొలార్డ్ (22) బంతుల్లో వేగంగా అర్ధ సెంచరీ సాధించిన వారిలో ఉన్నారు.
*

ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్లు

క్రమ బ్యాట్స్‌మన్ మ్యాచ్‌లు ఇన్నింగ్స్‌లు పరుగులు అత్యధిక యావరేజ్ సెంచరీలు అర్ధ
సంఖ్య స్కోరు సెంచరీలు
1. డేవిడ్ వార్నర్ 12 12 692 100* 69.20 1 8
2. కేఎల్ రాహుల్ 14 14 593 100* 53.90 1 6
3. శిఖర్ ధావన్ 16 16 521 97* 34.73 0 5
4. అండ్రూ రస్సెల్ 14 13 510 80* 56.66 0 4
5. క్వింటన్ డీకాక్ 15 15 500 81 35.71 0 4
*
వేగవంతమైన సెంచరీ

క్రమ బ్యాట్స్‌మన్ బంతులు చేసిన ప్రత్యర్థి వేదిక మ్యాచ్
సంఖ్య పరుగులు జట్టు సమయం
1. జానీ బెయర్ స్టో 52 114 బెంగళూరు ఉప్పల్ 31 మార్చి
2. సంజూ శాంసన్ 54 102 హైదరాబాద్ ఉప్పల్ 29 మార్చి
3. డేవిడ్ వార్నర్ 54 100 బెంగళూరు ఉప్పల్ 31 మార్చి
4. విరాట్ కోహ్లీ 57 100 కోల్‌కతా ఈడెన్ 19 ఏప్రిల్
గార్డెన్స్
5. అజింక్య రహానే 58 105 ఢిల్లీ జైపూర్ 22 ఏప్రిల్
*
అత్యధిక సిక్సర్లు

క్రమ బ్యాట్స్‌మన్ మ్యాచ్‌లు ఇన్నింగ్స్‌లు సిక్సులు
సంఖ్య
1. అండ్రూ రస్సెల్ 14 13 52
2. క్రిస్ గేల్ 13 13 34
3. హార్దిక్ పాండ్య 16 15 29
4. రిషభ్ పంత్ 16 16 27
5. ఏబీ డివిలియర్స్ 13 13 26