క్రీడాభూమి

ఆస్ట్రేలియా టూర్‌కు కెప్టెన్‌గా ధోనీ కొనసాగింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 16: ఆస్ట్రేలియాలో వనే్డ, టి-20 క్రికెట్ సిరీస్‌ల్లో పాల్గొనే టీమిండియాను సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం ఎంపిక చేయనుంది. ఈ టూర్‌లో భాగంగా జనవరి 12 నుంచి 31 మధ్య ఆసీస్‌తో భారత్ 5 వనే్డలు, 3 టి-20 మ్యాచ్‌లు ఆడుతుంది. వనే్డలకు పెర్త్, బ్రిస్బేన్, మెల్బోర్న్, కాన్‌బెరా, సిడ్నీ నగరాలు ఆతిథ్యమిస్తాయి. అదేవిధంగా టి-20 మ్యాచ్‌లు అడెలైడ్, మెల్బోర్న్, సిడ్నీ నగరాల్లో జరుగుతాయి. కాగా, వనే్డ, టి-20 జట్లకు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీని కొనసాగించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలు స్వదేశంలో జరగనున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించే సహసానికి సెలక్షన్ కమిటీ సుముఖంగా ఉండకపోవచ్చు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వనే్డ, టి-20 సిరీస్‌ల్లో ఆడిన ఆటగాళ్లలో చాలా మందికి ఆసీస్ టూర్‌లోనూ అవకాశం దక్కవచ్చు. ఒకటిరెండు తప్ప భారీ మార్పులు లేకపోవచ్చని పరిశీలకుల అభిప్రాయం.