క్రీడాభూమి

మళ్లీ ఆరు సిక్సర్లు కొడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహాలీ, మే 16: ఒకే ఓవర్‌లో మళ్లీ ఆరు సిక్సర్లు కొడతానని భారత బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. కేన్సన్ వ్యాధికి చికిత్స పొందుతున్న 17 మంది పిల్లలు పిసిఎ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడిన మ్యాచ్‌ని చూసేందుకు ప్రత్యేకంగా వచ్చారు. ఆ మ్యాచ్‌లో యువీ 24 బంతులు ఎదుర్కొని అజేయంగా 42 పరుగులు సాధించి సన్‌రైజర్స్‌కు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత కేన్సర్ బాధిత బాలలతో కొద్దిసేపు ముచ్చటించిన యువీ వారికి భరోసా ఇచ్చాడు. 2007లో జరిగిన టి-20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన సంఘనను గుర్తుచేసిన ఒక బాలుడు మరోసారి ఆ ఫీట్‌ను సాధిస్తారా అని అడిగినప్పుడు యువీ స్పందిస్తూ ‘మీరు ప్రార్థించండి.. నేను మరోసారి ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొడతాను’ అన్నాడు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, అప్పుడు తాను ఆరు సిక్సర్లను ఎలా కొట్టానో తనకే తెలియదని అన్నాడు. చాలా కాలం గడిచిపోయిందని, అది ఏ విధంగా సాధ్యమైందో తనకు గుర్తుకూడా లేదని వ్యాఖ్యానించాడు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదీ అసాధ్యం కాదని కేన్సర్ వ్యాధి బారిన పడినప్పటికీ మృత్యుంజయుడిగా తిరిగి వచ్చి, మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించిన యువీ అన్నాడు.