క్రీడాభూమి

రాహుల్ సమర్థుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: యువ లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను లెజెండరీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. ముంబయి ఇండియన్స్ తరఫున, కోచ్ మహేల జయవర్ధనే మార్గదర్శకంలో సమర్థుడైన స్పిన్నర్‌గా రూపుదిద్దుకుంటున్నాడని ఒక ఇంటర్వ్యూలో సచిన్ పేర్కొన్నాడు. రాహుల్ మొదటి మ్యాచ్ ఆడక ముందే తాను అతని గురించి జయవర్ధనేకు కూడా చెప్పినట్టు సచిన్ తెలిపాడు. ఎంతో మంది సమర్థులైన బ్యాట్స్‌మెన్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో అతను అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో తనను తాను నిరూపించుకున్నాడని సచిన్ వ్యాఖ్యానించాడు. గత ఏడాది ముంబయి ఇండియన్స్ జట్టుతో చేరిన రాహుల్ ఫైనల్లో 4 ఓవర్లు బౌల్ చేసి, కేవలం 14 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అదే విధంగా ఇరానీ కప్‌లో రెస్ట్ఫా ఇండియా తరపున ఆడిన అతను 13 మ్యాచ్‌లు ఆడి, 81 ఓవర్లు బౌల్ చేశాడు.