క్రీడాభూమి

తమ్ముడే నాకు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: తన తమ్ముడు హార్దిక్ పాండ్య అసాధారణ ప్రతిభావంతుడని, అతనే తనుకు స్ఫూర్తి అని కృణాల్ పాండ్య వ్యాఖ్యానించాడు. నాలుగోసారి ఐపీఎల్ టీ-20 క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించిన ముంబయి ఇండియన్స్‌లో హార్దిక్, కృణాల్ సభ్యులు. 2008లో ఐపీఎల్ మొదలైనప్పుడు, వీరిద్దరూ టీనేజర్లు. ఐపీఎల్‌లో ముంబయికి ప్రాతినిథ్యం వహించాలని కలలు కనేవారు. తమ ప్రతిభాపాటవాలతో వారు ఫ్రాంచైజీలను ఆకట్టుకున్నారు. చివరికి ఇద్దరూ ముంబయి ఇండియన్స్ జట్టులో అవకాశం అందిపుచ్చుకున్నారు. 2017లో టైటిల్ గెల్చుకున్న ముంబయి జట్టులో వీరిద్దరూ సభ్యులు. తిరిగి ఇప్పుడు మరోసారి అదే జట్టు తరఫున ఐపీఎల్‌లో ఆడి, ట్రోఫీని అందుకున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే టీమిండియాలో కృణాల్‌కు స్థానం దక్కలేదు. అయితే, ఆ జట్టులో హార్దిక్ ఉన్నాడు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కృణాల్ ప్రస్తావిస్తూ, తన తమ్ముడు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో గొప్పగా రాణిస్తున్నాడని అన్నాడు. వేరెవరినో మార్గదర్శకుడిగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, సోదరుడే తనకు స్ఫూర్తినిస్తున్నాడని కృణాల్ చెప్పాడు. చివరి బంతి వరకూ హోరాహోరీగా సాగిన ఫైనల్లో తమ జట్టు గెలవడం ఎంతో ఆనందంగా ఉందని, తన సంతోషాన్ని మాటల్లో వ్యక్తం చేయలేనని అన్నాడు. ఈ టోర్నమెంట్‌లో 191 స్ట్రయిక్ రేట్‌లో 402 పరుగులు సాధించిన హార్దిక్ 14 వికెట్లు కూడా పడగొట్టాడు. ఐపీఎల్ ముగిసింది కాబట్టి, ఇక తాను వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌పై దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పాడు. ప్రపంచ కప్‌ను సైతం అందుకోవాలన్న కోరిక ఉందని అన్నిడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను గ్రూప్ దశలో రెండు పర్యాయాలు ఓడించిన ముంబయి మొదటి క్వాలిఫయర్‌లోనూ ఆ జట్టుపై విజయం సాధించిన విషయాన్ని హార్దిక్ ప్రస్తావించాడు. ఫైనల్లో మళ్లీ చెన్నై ఎదురుపడినప్పుడు చాలా మంది ఆ జట్టునే హాట్ ఫేవరిట్‌గా పేర్కొన్నారని చెప్పాడు. మూడు మ్యాచ్‌లను ఓడిన చెన్నై నాలుగో మ్యాచ్‌ని గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారని, కానీ, తాను మాత్రం ఫైనల్లోనూ తమదే విజయమని నమ్మానని అన్నాడు. అనుకున్న విధంగానే ఫైనల్లో గెలిచి ట్రోఫీని అందుకున్నామన్నాడు.
చిత్రం... ఐపీఎల్ ట్రోఫీతో హార్దిక్, కృణాల్ పాండ్య