క్రీడాభూమి

పొలార్డ్‌కు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌కు ఐపీఎల్ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ జరిమానా విధించాడు. అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాగా కట్టాలని ఆదేశించాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన ముంబయి విజయభేరి మోగించి, నాలుగోసారి టైటిల్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబయి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను డ్వెయిన్ బ్రేవో వేయగా, క్రీజ్‌లో పొలార్డ్ ఉన్నాడు. బ్రేవో వరుసబెట్టి మూడు మంతులను ఆఫ్ స్టంప్ నుంచి దూరంగా వేశాడు. ప్రత్యేకించి మూడో బంతి వికెట్లకు చాలా దూరంగా దూసుకెళ్లింది. ఈ మూడు బంతుల్లో దేనినీ అంపైర్ నితిన్ మీనన్ వైడ్‌గా ప్రకటించకపోవడంతో పొలార్డ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. బ్యాట్‌ను గాల్లోకి విసిరి అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. అనంతరం అంపైర్లు నితిన్ మీనన్, ఇయాన్ గౌల్ట్‌తో వాగ్వాదానికి దిగాడు. స్టంప్స్‌ను విడిచిపెట్టి క్రీజ్‌లో దూరంగా ఒక మూల గార్డ్ తీసుకొని నిలబడి, నిరసన ప్రదర్శించాడు. పొలార్డ్ తీరుపై అందిన ఫిర్యాదును పరిశీలించిన మ్యాచ్ రిఫరీ శ్రీకాంత్ అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించాడు.
చిత్రాలు.. ముంబయ ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఆగ్రహం.
*అంపైర్లు నితిన్ మీనన్, ఇయాన్ గౌల్ట్‌తో వాగ్వాదం