క్రీడాభూమి

పురుషుల ఏఎఫ్‌సీ కప్‌కు ముగ్గురు మహిళా రిఫరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, మే 14: ఆసియన్ ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ మంగళవారం పురుషుల కాంటినెంటల్ క్లబ్‌కు తొలిసారిగా మహిళల రిఫరీని నియమించింది. ఈ టీమ్‌కు అంతా మహిళలే రిఫరీలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జపాన్‌కు చెందిన రిఫరీ యోఊమి యమషితాతోపాటు ఆమెకు సహాయ రిఫరీలుగా మకొటొ బొజొనొ, నవొమి టెషిరొగి ఈ టీమ్‌లో ఉంటారు. మయన్మార్‌కు చెందిన యాంగాన్ యునైటెడ్, కాంబోడియాకు చెందిన నాగా వరల్డ్ జట్ల మధ్య బుధవారం నుంచి తువున్నా స్టేడియంలో ప్రారంభమయ్యే పురుషుల కాంటినెంటల్ క్లబ్ పోటీలకు ఈ ముగ్గురు మహిళలు రిఫరీలుగా వ్యవహరించనున్నారు. ఆసియన్ ఫుట్‌బాల్ కానె్ఫడన్‌కు చెందిన క్లబ్ నిర్వహించే పోటీలకు ముగ్గురు మహిళలు తొలిసారిగా రిఫరీలుగా నియమితులు కావడం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు అయిందని ఏఎఫ్‌సీ ఒక ప్రకటనలో పేర్కొంది.