క్రీడాభూమి

ప్రతి టీమ్ వెంట అవినీతి నిరోధక అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 14: వరల్డ్ కప్ మ్యాచ్‌లను అవినీతి రహితంగా నిర్వహించేందుకు ఐసీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌లో ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న వనే్డ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్‌లో పాల్గొనే 10 జట్ల సభ్యులు ఎలాంటి అవినీతి కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా ఉండేందుకు ఐసీసీ అవినీతి నిరోధక ఆధికారులను నియమించనుంది. ఈ విషయాన్ని ‘డెయిలీ టెలిగ్రాఫ్’ అనే వార్తా సంస్థ పేర్కొంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభానికి ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌లు సహా, టోర్నమెంట్ ముగిసేవరకు కూడా ఈ అధికారులు ఆయా టీమ్‌ల వెంబడి ఉంటారు. గతంలో మ్యాచ్‌లు జరిగే ప్రాంతంలోనే అవినీతి నిరోధక అధికారుల పర్యవేక్షణ జరిగేది. కానీ ఇపుడు అందుకు భిన్నంగా మెగా టోర్నమెంట్‌లో ప్రాతినిధ్యం వహించే ప్రతి టీమ్ వెంట ఒక్కో అవినీతి నిరోధక అధికారి ఉంటారని ఆ పత్రిక పేర్కొంది. ఆయా టీమ్‌లు బస చేసే హోటళ్లు, ప్రయాణం, శిక్షణతోపాటు అన్ని మ్యాచ్‌లలోనూ మ్యాచ్ ఫిక్సింగ్‌లకు ఆస్కారం లేకుండా అవినీతిరహితంగా వ్యవహరించేందుకు ఈ అధికారులు గట్టి నిఘా నేత్రంతో వ్యవహరిస్తారు. ఆయా జట్లలో పాల్గొనే టీమ్ సభ్యులందరితో మంచి సంబంధాలు కలిగి ఉండడంతోపాటు అవినీతికి ఆస్కారం లేకుండా టోర్నీ ఆసాంతం విజయవంతంగా ముగించేందుకు ఈ అవినీతి నిరోధక అధికారులు ఐసీసీ అవినీతి నిరోధక శాఖ మధ్య వారధిలా వ్యవహరిస్తారని ఆ పత్రిక తెలిపింది.