క్రీడాభూమి

ఐసీసీ మ్యాచ్ రిఫరీ ప్యానెల్‌లో భారత తొలి మహిళగా జి.ఎస్.లక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 14: భారత్‌కు చెందిన జి.ఎస్.లక్ష్మి (51) ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఏర్పాటు చేసిన మ్యాచ్ రిఫరీలో ఒకరుగా నియతులయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా జి.ఎస్.లక్ష్మి ఘనత వహించారు. ఐసీసీ అధికారికంగా నిర్వహించే అంతర్జాతీయ మ్యాచ్‌లకు లక్ష్మి నియామకం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇదిలావుండగా, క్లెయిర్ పొలొసాక్ పురుషుల వనే్డ ఇంటర్నేషన్ మ్యాచ్‌లకు తొలి మహిళా ఎంపైర్‌గా ఇటీవల ఎంపికైన విషయం తెలిసిందే. 2008-09లో దేశవాళీ క్రికెట్‌లో లక్ష్మి అధికారికంగా రిఫరీగా వ్యవహరించారు. అదేవిధంగా మూడు మహిళల వనే్డలతోపాటు మరో మూడు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు సైతం ఆమె రిఫరీగా పనిచేశారు. ఇదిలావుండగా, అంతర్జాతీయ మ్యాచ్ రిఫరీల్లో ఒకరిగా తనను ఐసీసీ నియమించినందుకు దీనిని గొప్ప గౌరవంగా భావిస్తానని జి.ఎస్.లక్ష్మి వ్యాఖ్యానించారు. భారత క్రికెట్ ప్రపంచంలో మ్యాచ్ రిఫరీగా సుదీర్ఘకాలంపాటు చేసిన అనుభవం వల్లే ఈ అరుదైన అవకాశం దక్కేందుకు దోహదపడిందని భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఒక క్రికెటర్‌గా ఉన్న అపార అనుభవంతోపాటు మ్యాచ్‌లకు అధికారిగా పనిచేసిన అనుభవం వల్లే అంతర్జాతీయ మ్యాచ్‌లలో రిఫరీగా ఎంపిక కావడానికి హేతువులై ఉంటాయని అంటూ ఐసీసీ నమ్మకాన్ని నిలబెడతానని పేర్కొన్నారు. ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీలుగా జి.ఎస్.లక్ష్మితోపాటు లారెన్ అజెన్‌బాగ్, కిమ్ కాటన్, శివానీ మిశ్రా, స్యూ రెడ్‌ఫెర్న్, మేరీ వాల్‌డ్రన్, జాక్వెయిన్ విలియమ్స్ ఉంటారు. తొలి మహిళా డెవలప్‌మెంట్ ప్యానల్ ఎంపైర్‌గా నియమితులైన కాథే క్రాస్ గత ఏడాది పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఐసీసీ సీనియర్ మేనేజర్ ఆడ్రిన్ గ్రిఫిత్ మాట్లాడుతూ ఎంపైర్లు, రిఫరీలుగా లక్ష్మి షెరిడాన్‌ల నియామకాన్ని గొప్ప విషయంగా అభివర్ణించారు. ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్‌లోకి వీరిద్దరు అధికారులుగా రావడాన్ని స్వాగతిస్తున్నామని, అంకితభావంతో పనిచేసే మహిళా అధికారులను మరింత ప్రోత్సహించే దిశగా ముందుకు దూసుకుపోయేందుకు ఇది దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.