క్రీడాభూమి

ఐపీఎల్‌తో చాలా నేర్చుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్టల్, మే 15: ఐపీఎల్‌తో చాలా నేర్చుకున్నానని ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయర్ స్టో అన్నాడు. పాకిస్తా న్‌తో మంగళవారం జరిగిన మూడో వనే్డలో బెయర్ స్టో 93 బంతుల్లోనే (123)సెంచరీ చేసి జట్టును గెలిపించా డు. మ్యాచ్ అనంతరం మాట్లాడు తూ ఐపీఎల్‌లో వేర్వేరు సంఘట నలు.. వేర్వేరు కోచ్‌లు, ఆటగాళ్లతో కలిసి ఆడడంతో చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పాడు. ఈ సంద ర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆటతీరును కొనియాడాడు. వార్నర్ ఒత్తిడిలోనూ చాలా బాగా ఆడతాడని పేర్కొన్నాడు. అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం తనకు కలిసొచ్చిందన్నాడు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున 10 మ్యాచ్‌లాడిన బెయర్ స్టో 55.62 యావరేజ్‌తో 445 పరుగులు చేశా డు. ప్రపంచకప్ నేపథ్యంలో ముం దుగానే స్వదేశానికి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే.