క్రీడాభూమి

యోగాతో ఫిట్నెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: యోగాతో అద్భుతమైన ఫిట్నెస్ సాధ్యమవుతుందని, ప్రొటీన్ ఎక్సర్‌సైజ్‌తోపాటు తాను యోగా కూడా చేస్తానని వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అన్నాడు. 39 ఏళ్ల గేల్ తన కెరీర్‌లో ఐదవ, చివరి వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడడానికి సిద్ధమవుతున్నాడు. నాలుగు పదుల వయసు సమీపిస్తుండడంతో ఎక్కువకాలం జిమ్‌లో గడుపుతున్నాడు. అయితే, యోగాతో ఫిట్నెస్ స్థాయి పెరుగుతుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. రోజంతా మైదానంలో శ్రమించిన తర్వాత, యోగాతో మానసికంగానేగాక, శారీరకంగానూ ప్రశాంతత పొందవచ్చని చెప్పాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో అతను 40.83 సగటుతో 490 పరుగులు సాధించాడు. అయితే, ఐపీఎల్‌తో వరల్డ్ కప్‌ను పోల్చలేమని చెప్పాడు. ప్రపంచ కప్‌లో ఎంతో బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుందని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఫామ్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనను వరల్డ్ కప్‌లోనూ కొనసాగిస్తానని అన్నాడు. తనకు వయసు మీదపడుతున్న మాట వాస్తవమేనని గేల్ అంగీకరించాడు. అయితే, మనం ఏ విధంగా ఆలోచిస్తే, శరీరం అందుకు తగినట్టు మారుతుందని వ్యాఖ్యానించాడు. వయసు నుంచి తాను ఆలోచించడం లేదని, వరల్డ్ కప్‌లో తన అనుభవం మొత్తాన్ని వినియోగించి, విండీస్‌కు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నాడు. కొంతకాలం తాను జిమ్‌కు దూరంగా ఉన్నానని, ఇప్పుడు మళ్లీ వెళుతున్నానని చెప్పాడు. రొటీన్ ఎక్సర్‌సైజ్ ఉన్నా, లేకున్నా యోగాతో ఫిట్నెస్‌ను కాపాడుకోవచ్చని వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఇప్పటి వరకూ 10,151 పరుగులు సాధించిన గేల్ అన్నాడు. గత వనే్డ సిరీస్‌లో అతను 106 సగటుతో 424 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ వంటి మేటి జట్టుపైనా అతను చెలరేగి ఆడాడు. ఇంగ్లాండ్‌లోనే వరల్డ్ కప్ టోర్నమెంట్ జరగనున్న విషయాన్ని ప్రస్తావించగా, అక్కడి పిచ్ తీరుపై తనకు అవగాహన ఉందని చెప్పాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, వ్యూహాల పట్ల తనకు నమ్మకం లేదని స్పష్టం చేశాడు. ఎవరికి వారు తమ సొంత ఫార్ములాను రూపొందించుకొని, అమలు చేసుకోవాలని హితవు పలికాడు. ప్రపంచ కప్ టోర్నీ హోరాహోరీగా సాగనుందని జోస్యం చెప్పాడు. విండీస్‌కు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యమని గేల్ అన్నాడు.