క్రీడాభూమి

శోధన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, మే 16: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పిన దీపక్ శోధన్ అహ్మదాబాద్‌లోని తన స్వగృహంలో మృతి చెందాడు. భారత టెస్టు క్రికెటర్లలో జీవించి ఉన్న వారిలో ఎక్కువ వయసుగల ఆటగాడిగా గుర్తింపు పొందిన 87 శోధన్ కొంత కాలంగా కేన్సన్ వ్యాధితో బాధపడుతున్నాడు. గుండెపోటుకు గురైన శోధన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ శోధన్ తన కెరీర్‌లో మూడు టెస్టులు ఆడాడు. 1952లో పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో మొదటి నాలుగు టెస్టులకు శోధన్ 12వ ఆటగాడిగా ఉన్నాడు. ఐదో టెస్టు కోల్‌కతాలో జరిగింది. ఆ మ్యాచ్‌లో విజయ్ హజారే అనారోగ్యం కారణంగా ఆడలేకపోయాడు. దీనితో శోధన్‌కు టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం లభించింది. దీనిని సద్వినియోగం చేసుకున్న అతను మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 110 పరుగులు సాధించాడు. ఇంతియాజ్ అహ్మద్ క్యాచ్ అందుకోగా ఫజల్ మహమూద్ బౌలింగ్‌లో అతను అవుటయ్యాడు. లాలా అమర్‌నాథ్ తర్వాత అరంగేట్రం చేసిన టెస్టులోనే శతకాన్ని సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. డ్రాగా ముగిసిన ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం శోధన్‌కు లభించలేదు.
కెరీర్‌లో చివరిదైన మూడో టెస్టును శోధన్ వెస్టిండీస్‌తో ఆడాడు. హఠాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేకపోయాడు. భారత్ ఓటమి అంచున నిలిచిన నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన శోధన్ అజేయంగా 15 పరుగులు చేసి, మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించాడు. ఆతర్వాత అతను జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. మొత్తం మీద కెరీర్‌లో 3 టెస్టులు ఆడిన 181 పరుగులు చేశాడు. 60 బంతులు బౌల్ చేసి, ఒక్క వికెట్ కూడా సాధించలేదు. 43 ఫస్ట్‌క్లాస్‌లు ఆడిన శోధన్ ఖాతాలో 1,802 పరుగులున్నాయి. నాలుగు శతకాలు, ఏడు అర్థ శతకాలతో రాణించిన అతని అత్యధిక స్కోరు 261 పరుగులు. 5,358 బంతులు బౌల్ చేసిన అతను 73 ఫస్ట్‌క్లాస్ వికెట్లు పడగొట్టాడు.