క్రీడాభూమి

ఒకసారి కాదని.. మరోసారి అవునని..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: ఒకసారి అవునని, మరోసారి కాదని ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నాడంటూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నాపై బోర్డు పాలనాధికారుల బృందం (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ మండిపడింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నమెంట్‌లో విజేతకు ట్రోఫీని తాను బహుకరించాలని అనుకున్నట్టు ఒక ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. ఇంతకు ముందు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వనే్డ సిరీస్ ముగిసిన తర్వాత ట్రోఫీని విజేత జట్టుకు అందించేందుకు ఖన్నా నిరాకరించాడని గుర్తుచేసింది. ఈ కారణంగానే, ప్రొటోకాల్ ప్రకారం తాను ఐపీఎల్ ట్రోఫీని అందచేయాలని అనుకున్నట్టు చెప్పింది. కానీ, ఆ అవకాశం తనకు దక్కలేదని, ఈ విషయాన్ని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ దృష్టికి తీసుకెళతానని ఎడుల్జీ తెలిపింది. ఖన్నా ఒక్కోసారి ఒక్కోరకంగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సరైన విధానం కాదని వ్యాఖ్యానించింది.