క్రీడాభూమి

పాక్ క్రీడాకారులకు వీసాపై కేంద్రంతో చర్చిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: పాకిస్తాన్ క్రీడాకారులకు వీసా జారీ చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహ తా తెలిపాడు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడు తూ, పాకిస్తాన్ అథ్లెట్లకు భారత ప్రభుత్వం వీసాలను నిరాకరిస్తున్న విషయాన్ని గుర్తుచేశాడు. ముంబయి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను కొనసాగించని విషయం తెలిసిందే. అయితే, భారత్‌లో జరిగే ఈవెంట్స్‌లో పాక్ అథ్లెట్లు ఎవరైనా పాల్గొనాలంటే, వారికి వీసాలను జారీ చేస్తూ వచ్చింది. కానీ, ఇటీవల పుల్వామా సంఘటన తర్వాత కేంద్రం మరింత కఠినంగా వ్యవహరిస్తున్నది. పాకిస్తాన్ అథ్లెట్లు లేదా క్రీడాకారులు ఎవరికీ వీసాను మంజూరు చేయడం లేదు. ఇటీవల ఇక్కడ జరిగిన షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పాక్‌కు చెంది న ఇద్దరు షూటర్లు పాల్గొనాల్సి ఉండింది. వారితోపాటు ఒక అధికారిని కూడా పాక్ షూటింగ్ సమాఖ్య ఎంపిక చేసింది. కానీ, భారత ప్రభుత్వం వారికి వీసాను జారీ చే యలేదు. కాగా, రాజకీయాలను క్రీడలతో ముడిపెట్టకూడదని అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) స్పష్టం చేస్తున్నది. ఆ నిబంధనలను పాటించని దేశాలపై ఐఓసీ తీవ్రంగా స్పందించే ప్రమాదం ఉంది. ఒకప్పుడు భారత్ లో క్రీడా రంగంపై రాజకీయ నాయకుల పెత్తనం పెరిగింద న్న ఆరోపణలపై ఐఓఏను ఐఓసీ చాలాకాలం నిషేధించిం ది. అతి కష్టం మీద ఐఓఏ నిషేధం నుంచి బయటపడింది. మరోసారి అలాంటి ప్రమాదం ఎదురుకాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాజీవ్ మెహ తా తెలిపాడు. ఈనెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయని, ఆతర్వాత కేంద్రంతో చర్చలు జరుపుతామని ఆయన స్పష్టం చేశాడు. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి కృషి చేస్తామన్నాడు.