క్రీడాభూమి

నేడు బంగ్లా, విండీస్ ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ బ్లిన్, మే 16: వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ముగింపు దశకు చేరుకుంది. శుక్రవారం బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయ. మొత్తం 7 వనే్డల ముక్కోణపు సిరీస్‌లో ఐర్లాండ్ ఆడిన మ్యాచ్‌లన్నింటిలోనూ ఓడిపోయ ఇంటిదారి పట్టింది. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్ మూడు, వెస్టిండీస్ రెండు మ్యాచ్‌లను నెగ్గాయ. మే 9న ఐర్లాండ్, బంగ్లాదేశ్ నడుమ జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయంది.
ఆకట్టుకున్న ఐర్లాండ్..
పసికూనగా బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు తమకంటే పెద్ద జట్లయన వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు ముచ్చెమటలు పట్టించింది. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయ 327 భారీ పరుగుల స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. అయతే ఈ విండీస్ సైతం 5 వికెట్లు నష్టపోయ విజయం సాధించింది.
మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్లు కోల్పోయ 292 పరుగులు చేసింది. అయతే బౌలింగ్‌లో విఫలమైన ఐర్లాండ్ ఈ మ్యాచ్‌ను సైతం ఓడిపోయంది. మొత్తం మీద ఈ ముక్కోణపు సిరీస్‌లో ఐర్లాండ్ జట్టు మూడు మ్యాచ్‌ల్లో 250 పరుగులకు పైగా చేసి, తామేం పసికూన జట్టు కాదని నిరూపించింది.
క రేబియన్‌కు ఏమైంది?
ప్రపంచకప్ ముందు విండీస్ జట్టు ప్రదర్శన బోర్డుతో పాటు క్రికెట్ అభిమానులను సైతం భయబ్రాంతులకు గురి చేస్తోంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా విండీస్ బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించలేకపోయంది. గతంలో హేమాహేమీలను ఓడిం చిన జట్టుగా పేరుగాంచిన విండీస్ బంగ్లాదేశ్‌పై ఓడిపోవ డం, అదీ ప్రపంచకప్ ముందు కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయతే నేడు జరిగే ఫైనల్‌లో గెలిచి, ఆటగాళ్లలో మనోస్థైర్యాన్ని పెంచాలని కోరుకుంటున్నారు.
సంచలనాల బంగ్లా..
పసికూనతో మొదలైన బంగ్లాదేశ్ ప్రస్థానం ఆ తర్వాత ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుతం టెస్టులాడుతున్న అన్ని జట్లను ఓడించింది. గతంతో పోల్చుకుంటే తమ జట్టు అన్ని జట్లకు దీటుగా రాణిస్తుందని ఆటగాళ్లు పేర్కొంటున్నారు. ప్రస్తుత జట్టులో ఓపెనింగ్‌తో పాటు ఆల్‌రౌండర్లు, బౌలర్లకు కొదువలేదు.