క్రీడాభూమి

ట్రింఫ్ నైట్‌పై ‘సూపర్’ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంఖడే: ముంబయ ప్రీమియర్ లీగ్ 2019 ఐదో మ్యాచ్‌లో బుధవారం ట్రింఫ్ నైట్‌పై సోబో సూపర్‌సోనిక్స్ 4 వికెట్లతో విజయం సాధించింది. సూపర్‌సోనిక్స్ జట్టులో ఓపెనర్ హెర్ష్ ట్యాంక్, గోకుల్ బిస్తాలు రాణించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రింఫ్ నైట్స్ జట్టులో కరణ్ మోరే (55), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (20) మినహా మరెవరూ చెప్పుకోదగిన స్థాయలో రాణించకపోవడంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయ 143 పరుగులు చేసింది. సూపర్ సోనిక్స్ బౌలర్లలో దీపక్ శెట్టి 3, వైభవ్ మాలి 2, రోహన్ రాజే, ధ్రుమిల్ మట్కర్, పరాగ్ ఖానాపుర్కర్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత 144 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సూపర్ సోనిక్స్ జట్టు మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్లు జై గోకుల్ బిస్తా (24), హెర్ష్ ట్యాంక్ (47) రాణించారు. చివర్లో అదిబ్ ఉస్మాని (16, నాటౌట్) కడవరకు క్రీజులో ఉండడంతో సూపర్ సోనిక్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయ విజయం సాధించింది. ట్రింఫ్ నైట్ బౌలర్లలో రైస్టన్ డియాస్ 3, ప్రసాద్ పాటిల్ 2, పరీక్షిత్ వలసంగ్కార్ 1 వికెట్ తీశారు.