క్రీడాభూమి

ప్రపంచకప్ ముందు పాక్‌కు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింగ్‌హామ్, మే 17: ప్రపంచకప్ ముందు పాకిస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో వనే్డలో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ 3 పరుగుల వద్ద గాయపడ్డాడు. మార్క్‌వుడ్ వేసిన బంతిని షాట్ ఆడే క్రమంలో మోచేతి కి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో దీంతో ఇమామ్ రిటైర్ డహార్ట్‌గా వెనుదిరిగాడు. అద్భుత ఫాంలో ఉన్న బ్యాట్స్ మన్ మరికొద్ది రోజుల్లో జరిగే ప్రపంచకప్ ముందు గాయపడడంతో పాకిస్తాన్‌కు ఆందోళన కలిగించే విషయమే. పాక్ చీఫ్ సెలక్టర్, ఇమామ్ మేనమామ ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ చికిత్స జరుగుతు న్నట్లు చెప్పాడు. మిగతా విషయాలను తర్వలోనే వెల్లడిస్తామని వివరించాడు. 5 మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఇప్పటికే ఇంగ్లాండ్ 2-0 తేడాతో ముందజలో ఉంది.
చిత్రం... గాయంతో విలవిల్లాడుతున్న ఇమామ్