క్రీడాభూమి

ఒకరు బ్యాట్‌మన్.. మరొకరు సూపర్‌మన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 17: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పించ్ హిట్టర్ ఎబి డివిలియర్స్‌లో ఒకరు బ్యాట్‌మన్‌కాగా, మరొకరు సూపర్‌మన్ అని అదే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ వ్యాఖ్యానించాడు. వీరిద్దరూ 12 మ్యాచ్‌ల్లో 1,349 పరుగులు జోడించారని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుర్తుచేశాడు. కోహ్లీ, డివిలియర్స్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నాడు. నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో వీరిద్దరూ బెంగళూరుకు తొమ్మిది వికెట్ల తేడాతో విజయాన్ని అందించారని ప్రశంసించాడు. వీరి ఫామ్ జట్టులోని మిగతా ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుందని అన్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌లోనూ గెలిచి, తమ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.