క్రీడాభూమి

రాయ్.. రయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింగ్ హామ్, మే 18: జాసన్ రాయ్ సెంచరీకి తోడు బెన్ స్టోక్ స అర్ధ సెంచరీ సాధించడంతో నాలుగో వనే్డలోనూ పాకి స్తాన్ ఘోర పరాజయం ముటగట్టుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ (3) పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగా డు. మార్క్‌వుడ్ వేసిన బంతిని షాట్ ఆడే క్రమంలో మోచేతి కి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో దీంతో ఇమామ్ రిటైర్ డహార్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజమ్ తో కలిసి ఫాఖర్ జమాన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సెంచరీ భాగస్వా మ్యంతో ప్రమాదకరంగా మారిన వీరి జోడిన టామ్ కుర్రాన్ విడదీశాడు. జట్టు స్కోరు 116 పరుగుల వద్ద ఫాఖర్ జమాన్ (57) అవుటయ్యాడు. దీంతో సీనియర్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ హఫీజ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే అర్ధ సెంచరీ సాధించి జోరుమీదున్న బాబర్ ఇంగ్లీష్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా బౌండరీలు బాదుతున్నాడు. మరోవైపు క్రీజులో కుదు రుకున్నాక హఫీజ్ సైతం తనదైన శైలిలో ఆడుతూ ఇంగ్లాండ్ చుక్కలు చూపించారు. ఈ దశలో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న హఫీజ్ (59)ను కుర్రాన్ పెవిలియన్‌కు పం పాడు. కొద్దిసేపటికే బాబర్ ఆజమ్ (115) కూడా సెంచరీ చేసి మార్క్‌వుడ్ బౌలింగ్‌లో క్రిస్ జోర్దాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షోయాబ్ మాలిక్ (41), అసీఫ్ అలీ (17), ఇమాద్ వసీం (12) తమ స్థాయ మేరకు రాణించా రు. కెప్టెన్ సర్ఫరాజ్ అహమ్మద్ (21, నాటౌట్), హసన్ అలీ (1, నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండడంతో పాకిస్తాన్ 7 వికెట్లు కోల్పోయ 340 పరుగులు చేసింది. ఆ తర్వాత 341 పరుగుల లక్ష్యంతో బ్యా టింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయ లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ జాసన్ రాయ్ (114), బెన్ స్టోక్స్ (71), జేమ్స్ విన్స్ (43), జో రూట్ (36) రాణించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ఇంగ్లాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య చివరి వనే్డ ఆదివారం జరగనుంది.

చిత్రం... జాసన్ రాయ్ (114)