క్రీడాభూమి

ఇద్దరే ఇద్దరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: ప్రపంచ కప్ క్రికెట్‌లో భారత క్రికెటర్లు ఎంతోమంది సెంచరీలు చేశారు. అయితే, నాకౌట్ దశలో జరిగిన మ్యాచ్‌ల్లో శతకాన్ని సాధించిన ఆటగాళ్లు ఇద్దరే. 2003 వరల్డ్ కప్‌లో కెన్యాపై సౌరవ్ గంగూలీ, 2015 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్‌పై రోహిత్ శర్మ నాకౌట్ మ్యాచ్‌ల్లో శతకాలను నమోదు చేశారు. విరాట్ కోహ్లీ, సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెవాగ్, యువరాజ్ సింగ్ వంటి హేమాహేమీలు ఈ విధంగా నాకౌట్ దశలో సెంచరీలను సాధించలేకపోవడం విచిత్రం. నాకౌట్ దశలను అధిగమించి భారత్ మూడు పర్యాయాలు ఫైనల్ చేరింది. అందులో రెండు పర్యాయాలు విజేతగా నిలిచింది. ఇన్ని నాటౌట్ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, వాటిలో కేవలం రెండు సెంచరీలు మాత్రమే నమోదు కావడం గమనార్హం.
భారత్ వామప్ మ్యాచ్‌లు
ఈసారి ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో అడుగు పెట్టే ముందు మిగతా జట్ల మాదిరిగానే భారత్ కూడా వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ వామప్ మ్యాచ్‌లో ఈనెల 24న బ్రిస్టల్ మైదానంలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగే పోరుతో మొదలవుతాయి. అదే రోజున సోఫియాలో జరిగే మరో మ్యాచ్‌లో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు ఢీ కొంటాయి. భారత్ తొలి వామప్ మ్యాచ్‌ని న్యూజిలాండ్‌తో ఆడుతుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో 25వ తేదీ ఈ మ్యాచ్ ఉంటుంది. దీనికంటే ముందు, రోజ్ బౌల్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి. 26న దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఒక మ్యాచ్‌లో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరో మ్యాచ్‌లో ఆడతాయి. 27న కెన్నింగ్‌టన్ ఓవల్‌లో జరిగే మొదటి వామప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్ బరిలోకి దిగుతాయి. అదే రోజు రోజ్ బౌల్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మ్యాచ్ ఆడతాయి. 28న సోఫియా గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ తన రెండో వామప్ మ్యాచ్ ఆడుతుంది. బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు ఢీ కొంటాయి.

చిత్రాలు..సౌరవ్ గంగూలీ *రోహిత్ శర్మ