క్రీడాభూమి

సర్దార్‌కు విశ్రాంతి.. భారత హాకీ కెప్టెన్‌గా శ్రీజేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 18 మందితో కూడిన భారత హాకీ జట్టుకు గోల్‌కీపర్ శ్రీజేష్ నాయకత్వం వహించనున్నాడు. వచ్చేనెల 10 నుంచి 17 వరకు లండన్‌లో జరిగే ఈ టోర్నీ నుంచి రెగ్యులర్ కెప్టెన్ సర్దార్ సింగ్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో జట్టు పగ్గాలను శ్రీజేష్‌కు అప్పగించారు. సర్దార్ సింగ్‌తోపాటు స్ట్రయికర్ రమణ్‌దీప్ సింగ్, డిఫెండర్ జస్‌ప్రీత్ సింగ్ కులార్‌లకు కూడా విశ్రాంతినిచ్చారు. ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేందుకు వీలుగా వలెన్షియాలో జరిగే ఆరు దేశాల టోర్నీలో భారత్ పాల్గొంటుంది. అప్పటికి ఫిట్నెస్ సమస్య లేకుండా సిద్ధం ఉండేందుకే సర్దార్, రమణ్‌దీప్, జస్‌ప్రీత్‌లకు విశ్రాంతినిచ్చినట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు నరేందర్ బత్రా పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. అంతేగాక, కొంత మంది యువ ఆటగాళ్ల ప్రతిభాపాటవాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం కూడా చీఫ్ కోచ్ రోలాంట్ ఆల్ట్‌మన్స్‌కు ఉంటుందని తెలిపాడు. ఒలింపిక్స్‌కు అత్యుత్తమ జట్టును పంపుతామని అన్నాడు. ఇలావుంటే, ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో రాణించేందుకు భారత జట్టు విశేషంగా కృషి చేస్తున్నది. ఈ క్రమంలోనే పలు టోర్నీల్లో పాల్గొంటున్నది. చాంపియన్స్ ట్రోఫీ ముగిసున తర్వాత జరిగే ఆరు దేశాల హాకీ టోర్నీలో సర్దార్ తదితరులు బరిలోకి దిగుతారు.
చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన భారత హాకీ జట్టు
పిఆర్ రాజేష్ (కెప్టెన్), వికాస్ దహియా, ప్రదీప్ మోర్, విఆర్ రఘునాథ్, కోథాజిత్ సింగ్, సురేందర్ కుమార్, హర్‌మన్‌ప్రీత్ సింగ్, దనీష్ ముజ్‌తబా, చింగ్లెన్‌సనా సింగ్, మన్‌ప్రీత్ సింగ్, ఎస్‌కె ఉతప్ప, దేవీందర్ వాల్మికీ, హర్జీత్ సింగ్, తల్వీందర్ సింగ్, మన్దీప్ సింగ్, ఎస్‌వి సునీల్ (వైస్-కెప్టెన్), ఆకాశ్‌దీప్ సింగ్, నికిన్ తిమ్మయ్య.