క్రీడాభూమి

కోర్టు ఆవరణలో కాదు శిక్షణా స్థలంలో ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: రెజ్లర్లు కోర్టులో కాదు.. శిక్షణా స్థలంలో ఉండాలని సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్‌లకు ఢిల్లీ హైకోర్టు హితవు పలికింది. రియో ఒలింపిక్స్‌కు ఎవరిని పంపాలనే విషయంలో అత్యవరసమైతేనే జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. పోటీదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ)ని ఆదేశించింది. ఆగస్టు మాసంలో జరిగే రియో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ పురుషుల 74 కిలోల విభాగంలో ఒకరికి మాత్రమే భారత్ నుంచి పోటీపడే అవకాశం ఉంటుంది. లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్న తర్వాత మేజర్ ఈవెంట్స్‌కు దూరంగా ఉన్న సుశీల్ కుమార్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, ఇటీవల కాలంలో పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని, సత్తా చాటడమేగాక, ఈ విభాగంలో భారత్‌కు పోటీపడే అవకాశాన్ని సంపాదించి పెట్టిన నర్సింగ్‌వైపు డబ్ల్యుఎఫ్‌ఐ మొగ్గు చూపుతోంది. ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న వారికి నిర్వహించే శిక్షణ శిబిరానికి ఎంపిక చేసిన జాబితాలో నర్సింగ్‌కు అవకాశం కల్పించి, సుశీల్ పేరును పక్కకుపెట్టింది. నర్సింగ్‌తో ట్రయల్ బౌట్ నిర్వహించి, విజేతను ఒలింపిక్స్‌కు పంపాలన్న తన డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోక పోవడంతో ఢిల్లీ హైకోర్టులో సుశీల్ పిటిషన్ దాఖలు చేశాడు. ట్రయల్ బౌట్‌కు ఆదేశించాల్సిందిగా కోరాడు. దీనిపై కోర్టు స్పందిస్తూ, ఇలాంటి విషయాల్లో అత్యవసరమైతే తప్ప జోక్యం చేసుకోమని తెలిపింది. కోర్టులో సమయం వృథా చేయవద్దని సుశీల్, నర్సింగ్‌లకు సూచించింది. అభ్యర్థి ఎంపిక పారదర్శకంగా ఉండేలా చూడాలిన డబ్ల్యుఎఫ్‌ఐని ఆదేశించింది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. సుశీల్‌ను భారత దేశం గర్వించతగ్గ రెజ్లర్‌గా అభివర్ణించింది. అయితే, నర్సింగ్‌ను తక్కువ అంచనా వేయరాదని కోర్టు స్పష్టం చేసింది. నర్సింగ్ పలు పోటీల్లో బరిలోకి దిగకపోతే, ఒలింపిక్స్‌లో 74 కిలోల విభాగంలో పోటీపడే అవకాశం భారత్‌కు లభించి ఉండేది కాదని వ్యాఖ్యానించింది. ఎవరిని ఎంపిక చేసినా, దేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచడమే లక్ష్యం కావాలని హితవు చెప్పింది.