క్రీడాభూమి

నాదల్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, మే 20: చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను 6-0, 4-6, 6-1 తేడాతో ఓడించిన 3స్పెయిన్ బుల్2 రాఫెల్ నాదల్ ఇటాలియన్ ఓపెన్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. అతనికి కెరీర్‌లో ఇది రికార్డు స్థాయిలో 34వ మాస్టర్స్ టైటిల్. ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న నాదల్ మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అదే స్ఫూర్తితో, ఈనెల 26 నుంచి పారిస్‌లో జరిగే 123వ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు సిద్ధమయ్యాడు. కెరీర్‌లో అతను 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించగా, వీటిలో 11 ఫ్రెంచ్ ఓపెన్‌లో దక్కినవే కావడం విశేషం. క్లే కోర్టులపై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ, స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న నాదల్ ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు. మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. 2005, 2006, 2007 సంవత్సరాల్లో రొలాండ్ గారోస్ స్టేడియంలో వరుసగా విజేతగా నిలిచి హ్యాట్రిక్ సాధించిన అతను 2008లోనూ టైటిల్ అందుకున్నాడు. తిరిగి అదే స్థాయి ప్రదర్శనతో 2010, 2011, 2012 సంవత్సరాల్లో టైటిల్‌ను గెల్చుకోవడం ద్వారా రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2013, 2014 సంవత్సరాల్లోనూ అతనికే టైటిల్ దక్కింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ విధంగా, వరుసగా ఐదు పర్యాయాలు ఒక ఆటగాడు టైటిల్ సాధించడం అదే మొదటిసారి. కాగా, అంతకు ముందు 2008లో, ఆతర్వాత 2017, 2018 సంవత్సరాల్లో అతను ఫ్రెంచ్ ఓపెన్ రారాజుగా నిలిచాడు. ఈ ఏడాది టైటిల్‌ను నిలబెట్టుకుంటే, ముచ్చటగా మూడోసారి అతను హ్యాట్రిక్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంటాడు. ప్రస్తుతం అను కనబరుస్తున్న ఫామ్‌ను గమనిస్తే, ఫ్రెంచ్ ఓపెన్‌లో అతనికి ఎదురులేదనే అభిప్రాయం బలపడుతున్నది. ఈ దూకుడును అతను ఎంత వరకూ కొనసాగిస్తాడో చూడాలి. గాయాలు తిరగబెట్టి, ఫిట్నెస్ సమస్యలు తలెత్తకపోతే, నాదల్‌ను రొలాండ్ గారోస్ కోర్టులపై నిరోధించడం అసాధ్యమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

చిత్రం... గతేడాది గెలుచుకున్న ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీతో నాదల్