క్రీడాభూమి

ఇంగ్లాండ్ జట్టులో భారీ మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 21: సొంత గడ్డపై మే 30 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ కప్ టోర్నీకి ఇంగ్లాండ్ తన తుది జట్టు ను మంగళవారం ప్రకటించింది. అంతకుముందు జట్టులో చోటు దక్కించుకున్న డేవిడ్ విల్లీ, జో డేన్లీల ను ప్రదర్శన కారణంగా తప్పించగా, డ్రగ్స్ కేసులో విఫలం కావడంతో అలె క్స్ హేల్స్‌కు సైతం తుది జట్టులో చోటు కల్పిం చలేదు. వీరి స్థా నాల్లో ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌తో పాటు లియా మ్ డాసన్, జేమ్స్ విన్సీలను జట్టులోకి తీసుకు న్నారు. గతంలో ప్రకటించిన ప్రిలిమినరి జట్టులో జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. అయతే ఆర్చర్ ఇప్పటివరకు మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లను మాత్రమే ఆడడం విశే షం. ఆటగాళ్ల జాబితాను మార్చుకు నేందుకు మే 23వరకు అవకాశం ఉండడంతో ఇంగ్లాండ్ మార్పులు చేసింది.
తుది జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జోనీ బెయరీ స్టో, జాసన్ రాయ్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయన్ అలీ, క్రిస్ వోక్స్, లియామ్ ప్లంకెట్, అదిల్ రషీద్, మార్ కవుడ్, జేమ్స్ విన్సీ, టామ్ కురాన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్.

చిత్రం... జోఫ్రా ఆర్చర్