క్రీడాభూమి

చివరి రెండు మ్యాచ్‌లకు మాక్స్‌వెల్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మే 17: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ గ్లేన్ మాక్స్‌వెల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయమైన పంజాబ్ గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒకటి బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఆడుతుంది. 21న విశాఖపట్నంలో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌ను ఢీ కొంటుంది. ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కేవలం నాలుగు విజయాలను సాధించింది. ఎనిమిది పరాజయాలనను ఎదుర్కొంది. మొత్తం ఎనిమిది పాయింట్లతో పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయంకాగా, చివరి రెండు గ్రూప్ మ్యాచ్‌ల్లో జయాపజయాల వల్ల పంజాబ్‌కు వచ్చే లాభనష్టాలేవీ ఉండవు. అయితే, చివరి స్థానంలో నిలవకుండా ఉండడంతోపాటు, విజయాలతో ఈసారి ఐపిఎల్‌ను ముగించాలని పంజాబ్ భావిస్తున్నది. అయితే, మాక్స్‌వెల్ గాయం కారణంగా దూరం కావడంతో ఈ జట్టు విజయావకాశాలను దారుణంగా దెబ్బతీస్తున్నది. ఐపిఎల్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లలో స్టీవెన్ స్మిత్, షాన్ మార్ష్, మిచెల్ మార్ష్, జాన్ హాస్టింగ్స్ గాయపడ్డారు. వారి జాబితాలో మాక్స్‌వెల్ కూడా చేరాడు. వెస్టిండీస్ టూర్‌కు ముందు కీలక ఆటగాళ్లు గాయపడడం పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఆందోళన వ్యక్తం చేస్తున్నది. మాక్స్‌వెల్‌కు వైద్య పరీక్షలు జరిపించిన తర్వాత అతనికి ఎంతకాలం విశ్రాంతి అవసరమన్నది తెలుస్తుందని సిఎ ఫిజియోథెరపిస్టు డేవిడ్ బీక్లే ప్రకటించాడు.