క్రీడాభూమి

కోహ్లీ ఒక్కడే గెలిపించలేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టును గెలిపించలేడని, జట్టులోని అం తా శ్రమిస్తేనే విజయాలు, టైటిల్ సాధించడం సాధ్యమవుతాయని భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానించాడు. బుధవా రం ఆయన పీటీఐతో మాట్లాడుతూ, ఇంగ్లాండ్ పిచ్‌లపై బంతి ఎక్కువగా స్పిన్ కాదని, అలాంటి పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ కష్టపడాల్సి ఉంటుందని అన్నాడు. ఎక్కువ సందర్భాల్లో ఒకరిద్దరు ఆటగాళ్లు అద్భుతంగా రాణించడంతో జట్టు విజయాలను నమోదు సాధారణమని అన్నాడు. అయితే, ఎప్పుడూ ఇది సాధ్యం కాదని, జట్టు మొత్తం సమష్టిగా కృషి చేస్తేనే విజయాలను సాధించగలుగుతామని వివరించాడు. కోహ్లీ పాత్రపై అడిగిన ప్రశ్నపై అతను స్పందిస్తూ, ఒక వ్యక్తిపై ఆధారపడి టోర్నీలను గెల్చుకోలేమని తేల్చిచెప్పాడు. 1996, 1999, 2003 సంవత్సరాల్లో సచిన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ఆటగాళ్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో, టీమిండియా ఆ మూడు పర్యాయాలు ట్రోఫీని అందుకోలేకపోయింది. 2011లో, మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో విజేతగా నిలిచింది. ఈ విషయాలను గురించి ప్రస్తావించగా, ఒకరిద్దరు ఆటగాళ్లు జట్టును గెలిపిస్తారనుకోవడం సరైన విధానం కాదన్నాడు. నిజానికి, అది ఎల్లవేళలా సాధ్యం కాదని వ్యాఖ్యానించాడు. ఇటీవల కాలంలో టీమిండియా ఆటగాళ్లు ఎన్నో టోర్నీలు, సిరీస్‌లు, మ్యాచ్‌లు ఆడారని సచిన్ చెప్పాడు. కాబట్టి, అన్ని సాట్లలోనూ ఆడేందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలన్నాడు. వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలవడం అసాధ్యం కాకపోయినా, సులభం మాత్రం కాదన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆడితే, విజయాలను సాధించవచ్చని పేర్కొన్నాడు.