క్రీడాభూమి

బౌలర్లకు నేనంటే భయమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్ మే 22: కెమెరా ముందు ఎవరూ చెప్పరు కానీ.. నేనంటే బౌలర్లకు భయమేనని యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ స్టార్ బ్యాట్‌మన్ క్రిస్ గేల్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో రాణించడంతో ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న గేల్‌ను ఆ తర్వాత బోర్డు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు విండీస్ జట్టు ఇంగ్లాండ్‌కు చేరుకోగా, ఐదో, చివరి ప్రపంచకప్ ఆడుతున్న గేల్ మాత్రం మెగా టోర్నీలో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గేల్‌ను ‘మిమ్మల్ని చూసి బౌలర్లు భయపడుతున్నారా?’ అని ప్రశ్నించగా యూనివర్సల్ బాస్ సామర్థ్యం ఏంటో వారికి తెలుసు. నేను ఫాంలో ఉంటే ఎలా ఆడతానే ఆఫ్ ది రికార్డ్స్ అడిగితేనే చెబుతారు. కెమెరా ముందు వారు చెప్పుకోలేక పోవచ్చు. అని సమాధానమిచ్చా డు. ఒక బ్యాట్స్‌మన్‌గా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటా. ఫాస్ట్ బౌలింగ్ హిట్టింగ్ చేయడ మంటే చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చాడీ యూనివ ర్సల్ బాస్.
తను ఇన్ని ప్రపంచకప్‌లు ఆడతానని ఊహించలేదని, తన ఆటలో స్థిరత్వంతోనే ఇది సాధ్యమైందన్నాడు. మరో ఇంటర్వ్యూలో మ్యాచ్ మ్యాచ్‌కి గ్యాప్ దొరికితే పూర్తిగా విశ్రాంతి తీసుకుంటానని, మానసికంగా ధృడంగా తయార వడంపై దృష్టి సారిస్తానని పేర్కొన్నాడు. ఈ ప్రపంచకప్‌లో వెస్టిండీస్ తన మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది.