క్రీడాభూమి

భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరల్డ్ కప్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్‌కు దక్కింది. 1992 నుంచి 2011 మధ్య కాలంలో ఆరు వరల్డ్ కప్ టోర్నీలో ఆడిన సచిన్ మొత్తం 2,278 పరుగులు సాధించాడు. 1,743 పరుగులతో రికీ పాంటింగ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, ఒక వరల్డ్ కప్ టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు కూడా సచిన్ పేరిట ఉంది. 2003 వరల్డ్ కప్‌లో అతను 673 సాధించాడు. ఇంత వరకూ ప్రపంచ కప్‌లో 165 సెంచరీలు నమోదయ్యాయి. ఎక్కువ శతకాలను సాధించిన బ్యాట్స్‌మన్‌గానూ సచిన్ రికార్డు పుటల్లో చోటు సంపాదించాడు. అతని ఖాతాలో ఆరు సెంచరీలు ఉన్నాయి.
‘టై’ మ్యాచ్‌ల్లో స్టార్లు
వరల్డ్ కప్ క్రికెట్‌లో ఫలితం తేలకుండా ‘టై’గా ముగిసిన మ్యాచ్‌ల్లో స్టార్లుగా నిలిచిన ఆటగాళ్లు లేకపోలేదు. 1999లో దక్షిణాఫ్రికాతో జరిగిన ‘టై’ మ్యాచ్‌లో షేన్ వార్న్ (ఆస్ట్రేలియా), 2003లో దక్షిణాఫ్రికాపై మర్వన్ ఆటపట్టు (శ్రీలంక), 2007లో జింబాబ్వేపై జెరోమీ బ్రే (ఆస్ట్రేలియా), 2011లో భారత్‌పై ఆండ్రూ స్ట్రాస్ (ఇంగ్లాండ్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు.