క్రీడాభూమి

టార్గెట్ టైటిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌంట్‌డౌన్-7
*
ఈసారి ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న ఇంగ్లాండ్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా ఎంచుకుంది. 1975లో వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి 2015 వరకూ జరిగిన 11 టోర్నీల్లో ఇంగ్లాండ్ విజేతగా నిలవలేకపోయింది. మూడు పర్యాయాలు ఫైనల్ చేరినప్పటికీ, రన్నరప్ ట్రోఫీతోనే సరిపుచ్చుకుంది. కానీ, గతాన్ని పక్కకుపెట్టి, సరికొత్త వ్యూహాలు, ప్రణాళికలను సిద్ధం చేసుకుంది.
1975 మొదటి వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ చేరిన ఈ జట్టు ఫైనల్‌లోకి అడుగుపెట్టలేకపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 36.2 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా 28.4 ఓవర్లలో, ఆరు వికెట్లు చేజార్చుకొని లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.
1979లో ఇంగ్లాండ్ తొలిసారి ఫైనల్ చేరింది. అయితే, తీవ్రమైన ఒత్తిడికిలోనై ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 60 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా ఇంగ్లాండ్ 51 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలి, 92 పగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
1983 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ ప్రస్థానం సెమీ ఫైనల్‌తోనే ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 60 ఓవర్లలో 213 పరుగులు చేయగా, భారత్ 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 217 పరుగులు సాధించి, ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత కూడా భారత్ అదే ఊపును కొనసాగించి, ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
1987లో ఇంగ్లాండ్ మరోసారి ఫైనల్ చేరింది. కానీ, ఆస్ట్రేలియా చేతిలో ఓడి, రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందింది. తుది పోరులో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 253 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ కడ వరకూ పోరాడినప్పటికీ, 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఏడు పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా ట్రోఫీని సొంతం చేసుకుంది.
1992లో ఇంగ్లాండ్ వరుసగా రెండోసారి, ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. టైటిల్ యుద్ధంలో పాకిస్తాన్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 249 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 49.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. 22 పరుగుల తేడాతో గెలిచిన పాక్ మొదటిసారి విశ్వవిజేతగా నిలిచింది.
1996 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ క్వార్టర్స్ మాత్రమే చేరగలిగింది. 50 ఓవర్లలో ఆ జట్టు ఎనిమిది వికెట్లకు 235 పరుగులు చేయగా, శ్రీలంక 40.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 236 పరుగులు సాధించడం ద్వారా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
1999లో ఇంగ్లాండ్ గ్రూప్ దశ దాటలేకపోయింది. భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 232 పరుగులు సాధిస్తే, అందుకు బదులుగా 45.2 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లాండ్ 63 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని, టోర్నీ నుంచి నిష్క్రమించింది.
2003 ప్రపంచ కప్‌లోనూ ఇంగ్లాండ్ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. కీలక మ్యాచ్‌లో ఈ జట్టు 50 ఓవర్లలో 204 పరుగులు సాధించగా, ఆస్ట్రేలియా 49.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 208 పరుగులు చేసి, రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.
2007లో ఇంగ్లాండ్ సూపర్ 8 దశలో పరాజయాన్ని ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 48 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో, కేవలం ఒక వికెట్ కోల్పోయి 157 పరుగులు సాధించడం ద్వారా, తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
2011లో కొంత మెరుగుపడిన ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరింది. కానీ, సెమీస్‌లోకి అడుగుపెట్టకుండా, శ్రీలంక చేతిలో ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 39.3 ఓవర్లలో, ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 231 పరుగులు చేసి, విజయభేరి మోగించింది.
2015 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ ఘోరంగా విఫలమై, గ్రూప్ దశను అధిగమించలేకపోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 275 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ 48.3 ఓవర్లు ఆడి, 260 పరుగులకు ఆలౌటైంది.
గత వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలోనే వెనుదిరిగినప్పటికీ, ఈసారి టైటిల్ ఫేవరిట్స్ జాబితాలో ఇంగ్లాండ్ చేరింది. ఇటీవల కాలంలో ఆ జట్టు రాణిస్తున్న విధానం, సాధిస్తున్న విజయాలే ఈ అభిప్రాయానికి బలాన్నిస్తున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఈ జట్టు సమతూకంగా ఉంది. సీనియర్లు, యువ ఆటగాళ్లతో బలాన్ని పెంచుకుంది. ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా తనకు ఉందని ఇటీవల పలు సందర్భాల్లో రుజువు చేసుకున్న ఇంగ్లాండ్, స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ ట్రోఫీని అందుకోవాలని ఆరాటపడుతున్నది.

చిత్రాలు.. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 4-0 తేడాతో గెలుచుకున్న ఇంగ్లాండ్ జట్టు
*ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్