క్రీడాభూమి

విక్రమార్కుడు దీపక్ పటేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్ తరఫున 1992 వరల్డ్ కప్‌లో ఆడిన దీపక్ పటేల్‌ను పట్టువదలని విక్రమార్కుడనే చెప్పాలి. అతని పూర్వీకులు భారత్ నుంచి కెన్యాకు తరలివెళ్లారు. నైరోబీలో పుట్టిన దీపక్ పటేల్‌కు చిన్నతనం నుంచి టెస్టు క్రికెట్ ఆడాలనే కోరిక ఉండేది. ఈ కోరికతోనే అతను ఇంగ్లాండ్‌కు వలస వెళ్లాడు. అక్కడ జాతీయ జట్టులో చోటు కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, పట్టు వదలకుండా ఇంగ్లాండ్ నుంచి న్యూజిలాండ్‌కు తరలివెళ్లాడు. సమర్థుడైన స్పిన్నర్‌గా గుర్తింపు సంపాదించాడు. కివీస్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1992 వరల్డ్ కప్‌లో ఆడుతూ, ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ వేశాడు. పేసర్ కాకుండా ఒక స్పిన్నర్ తొలి ఓవర్ వేయడం అప్పట్లో ఓ సంచలనం. ఇటీవల కాలంలో చాలా మంది ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ట్రెండ్ సెట్టర్‌గా దీపక్ పటేల్ క్రికెట్ చరిత్రలో తన కంటూ ఓ ప్రత్యేకతను సంపాదించాడు. న్యూజిలాండ్ తరఫున అతను 37 టెస్టులు, 75 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన అతను ప్రస్తుతం స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు.