క్రీడాభూమి

ఆత్మవిశ్వాసమా? అహంభావమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు 1996 వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన సుల్తాన్ జరావనీ తన స్వయంకృతం కారణంగానే క్రికెట్‌కు శాశ్వతంగా దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హెల్మెట్ లేకుండానే సూపర్ ఫాస్ట్ బౌలర్ అలాన్ డొనాల్డ్‌ను ఎదుర్కొనే సాహసం చేశాడు. మెరుపు వేగంతో బంతులు వేసే డొనాల్డ్‌కు ‘వైట్ లైట్నింగ్’ అనే పేరు ఉంది. అలాంటి మేటి పేసర్‌ను కేవలం టోపీ పెట్టుకొని ఎదుర్కొన్నందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నాడు. బంతి తలకు బలంగా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జరావనీని చంపేశానేమోనని డొనాల్డ్ భయపడ్డాడట. ఇంతటి సాహసానికి జరావనీ ఎందుకు పూనుకున్నాడో ఎవరికీ తెలియదు. అతడిది ఆత్మవిశ్వాసం అనాలా లేక అహంభావంగా పేర్కోవాలా అన్నది సమాధానం లేని ప్రశ్న.