క్రీడాభూమి

వాల్ష్ క్రీడా స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాస్ఫూర్తికి నిలువెత్తు ఉదాహరణగా వెస్టిండీస్ పేసర్ కొట్నీ వాల్ష్ పేరును చెప్పుకోవచ్చు. 1987 వరల్డ్ కప్‌లో అతని కారణంగా వెస్టిండీస్ టైటిల్‌ను చేజార్చుకుంది. కానీ, అతను ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి మాత్రం ఎప్పటికీ ఓ పాఠంలా నిలిచిపోయింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, ‘జెంటిల్మన్ గేమ్’ విలువలను పాటించాడు వాల్ష్. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్ చివరి ఓవర్‌లో విజయానికి పాక్ 14 పరుగుల దూరంలో నిలిచింది. ఆ ఓవర్‌ను వేసే బాధ్యతను వాల్ష్ తీసుకోవడంతో, విండీస్ విజయం ఖాయంగా కనిపించింది. మొదటి బంతికి అబ్దుల్ ఖాదిర్ సింగిల్ తీస్తే, రెండో బంతికి సలీం జాఫర్ మరో సింగిల్ చేశాడు. నాలుగు బంతులు.. 12 పరుగులు... ఖాదిర్ మూడో బంతిలో రెండు పరుగులు చేశాడు. ఈక్వేషన్ మూడు బంతులు.. 10 పరుగులుగా మారింది. ఆతర్వాతి బంతిని క్రీజ్‌లో ఖాదిర్ సిక్సర్‌గా మలిచాడు. రెండు బంతులు.. నాలుగు పరుగులు.. ఖాదిర్ మరో రెండు పరుగులు చేయడంతో, చివరి బంతికి పాక్ రెండు పరుగుల దూరంలో నిలిచింది. చివరి బంతి వేయడానికి వాల్ష్ రనప్ మొదలుపెట్టిన వెంటనే, నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న సలీం జాఫర్ క్రీజ్‌ను విడిచి ముందుకు దూసుకెళ్లాడు. అప్పుడు బంతితో స్టంప్స్‌ను కొడితే (మన్కడింగ్ చేస్తే) విండీస్ ఆ మ్యాచ్‌ని గెలిచి ఉండేది. సెమీస్‌లోకి అడుగుపెట్టేది. కానీ, వాల్ష్ ఆ పని చేయలేదు. సలీం జాఫర్‌ను వెనక్కు రమ్మని పిలిచి, మళ్లీ తన బౌలింగ్ మార్క్‌కు చేరుకున్నాడు. చివరి బంతిలో ఖాదిర్ రెండు పరుగులు చేయడంతో పాక్ విజయం సాధించింది. విండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. విండీస్ అభిమానులకు ఏమోగానీ, యావత్ ప్రపంచానికి వాల్ష్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు క్రీడాస్ఫూర్తి అన్న పదం వింటే ముందుగా అందరికీ అతనే గుర్తుకొస్తాడు.