క్రీడాభూమి

పిచ్‌ల తీరు అధ్వాన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మే 17: పాకిస్తాన్‌లో పిచ్‌ల తీరు అధ్వాన్నంగా ఉందని, ఈ పరిస్థితి కొనసాగితే అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లను అందించడం కష్టమని మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ అన్నాడు. పాకిస్తాన్ కప్ చాంపియన్‌షిప్ జరుగుతున్న తీరే పిచ్‌ల తీరుకు అద్దం పడుతుందని ఇటీవలే పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్‌గా నియమితుడైన ఇంజీ పేర్కొన్నాడు. టోర్నీ మొదలై ఐదు రోజులైనా ఇప్పటి వరకూ ఒక్క భారీ స్కోరు కూడా నమోదు కాలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పిచ్‌లను ఏ విధంగా ఉండాలో నిర్ణయించే అధికారం తనకు లేదని, అయితే, పిచ్‌లపైనే ఆటగాళ్లు ఏ విధంగా రాణిస్తారనే అంశం ఆధారపడి ఉంటుందని ఇంజీ అన్నాడు. సహజంగా వనే్డ మ్యాచ్‌ల్లో భారీ స్కోరు నమోదయ్యేలా పిచ్‌లు ఉండాలని అన్నాడు. బౌలర్లకు కూడా సహకరించాలని, ఈ విధంగా సమతుల్యతను పాటించకపోతే, ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పాడు. జూలై, ఆగస్టు మాసాల్లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే జట్టును ఎంపిక చేయడానికి దేశవాళీ పోటీలు బాగా ఉపయోగపడతాయని అన్నాడు. షోయబ్ మాలిక్, మహమ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా దేశవాళీ పోటీల్లో సత్తా నిరూపించుకుంటేనే సెలక్షన్ అవకాశాలను మెరుగు పరచుకుంటారని స్పష్టం చేశాడు. ఫామ్‌ను ప్రాతిపదికగా తీసుకొని సెలక్షన్ ఉంటుందని అన్నాడు. సెలక్షన్ విధానం పటిష్టంగా ఉన్నప్పుడే జట్టు ఆటతీరు మెరుగుపడుతుందని వ్యాఖ్యానించాడు.