క్రీడాభూమి

వరల్డ్ కప్ నిర్వహణపై రెండో అభిప్రాయం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, డిసెంబర్ 16: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)పై అవినీతి ఆరోపణలు వచ్చినా, 2022 వరల్డ్ కప్‌ను నిర్వహించే విషయంలో రెండో అభిప్రాయానికి తావులేదని కతార్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ హసన్ అల్ తవదీ స్పష్టం చేశాడు. ఈ హక్కులను సంపాదించడానికి ఫిఫా అధికారులకు కతార్ భారీగా ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలపై ప్రస్తుతం ముమ్మరంగా విచారణ జరుగుతున్నది. ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీసహా పలువురు అధికారులపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా, వరల్డ్ కప్ హక్కుల అంశాన్ని తిరగతోడే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే, అలాంటి భయాందోళనలేవీ తమకు లేవని అల్ తవదీ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నాడు. కతార్ ఎవరికీ లంచాలు ఇవ్వలేదని అన్నాడు. విచారణలో ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పాడు. వరల్డ్ కప్‌ను నిర్వహించే సత్తా తమకు ఉందన్నాడు. ఎవరు, ఎన్ని రకాలుగా అవరోధాలు సృష్టించాలని ప్రయత్నించినా తాము వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నాడు. 2020 వరల్డ్ కప్‌ను సమర్థంగా నిర్వహిస్తామన్నాడు. ఈ మెగా టోర్నీ కోసం చేపట్టిన భారీ ప్రాజెక్టు కోసం నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని చెప్పాడు. నిర్మాణాల సమయంలో ఒక్క చిన్న ప్రమాదం కూడా జరగలేదని, ఎవరూ మృతి చెందలేదని తెలిపాడు. కతార్ ప్రతిష్టను దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొడతామని అన్నాడు.