క్రీడాభూమి

నష్టపరిహారం అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కతార్‌లోని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రంలో శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరెరాను డోపింగ్ దోషిగా పేర్కోవడం, ఆ తర్వాత పొరపాటు జరిగిందంటూ కేసును ఉపసంహరించుకోవడం క్రికెట్ రంగంలో దుమారం రేపుతోంది. డోపింగ్ కేంద్రం నిర్వాకం కారణంగా కుశాల్ అత్యంత కీలకమైన సమయాన్ని కోల్పోయాడని, అతని ప్రతిష్ఠ కూడా దెబ్బతిన్నదని శ్రీలంక బోర్డు అంటున్నది. చేసిన పొరపాటుకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఐసిసిని డిమాండ్ చేస్తున్నది. అయతే, గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన చోటు చేసుకోకపోవడంతో, నష్టపరిహారం ఇవ్వడం అసాధ్యమని ఐసిసి స్పష్టం చేస్తున్నది. మొత్తం మీద కతార్ డోపింగ్ పరీక్షా కేంద్రం చేసిన పొరపాటు క్రికెట్ ప్రపంచాన్ని రెండు గ్రూపులుగా విభజించే ప్రమాదం కనిపిస్తున్నది.

దుబాయ్, మే 17: శ్రీలంక బ్యాట్స్‌మన్ కుశాల్ పెరెరాపై విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఉపసంహరించుకోవడంతో, అతనికి నష్టపరిహారం చెల్లించాలని లంక క్రికెట్ బోర్డు డిమాండ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కుశాల్‌కు పరిహారం చెల్లించేది లేదని ఐసిసి స్పష్టం చేస్తుంటే, ఒకరు చేసిన పొరపాటుకు మరొకరు బలికావాలా అంటూ లంక క్రికెట్ అధికారులు మండిపడుతున్నారు. డోపింగ్‌కు పాల్పడినట్టు కుశాల్‌పై వచ్చిన ఆరోపణలను నిరూపించే సాక్ష్యాధారాలు లభించలేదని స్పష్టం చేసిన ఐసిసి అతనికి క్లీన్‌చిట్ ఇచ్చింది. గత ఏడాది నవంబర్‌లో కతార్‌లోని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రంలో శ్రీలంక క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలను నిర్వహించారు. మూత్రం నమూనాలిచ్చిన వారిలో కుశాల్ డోపింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారణ అయినట్టు ఆ కేంద్రం తన నివేదికలో పేర్కొంది. అతను 19-నోరానడ్రోస్టెనెడియోన్‌ను వాడినట్టు పేర్కొంది. ఈ నివేదిక అందిన వెంటనే కుశాల్‌ను ఐసిసి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అతని కోరికపై తదుపరి విచారణ చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో కుశాల్ నుంచి సేకరించిన ‘బి’ శాంపిల్‌లోనూ అదే నిషిద్ధ మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నట్టు తేల్చిన కతార్ పరీక్షా కేంద్రం వివరాలను మాత్రం ఇవ్వలేకపోయింది. కొంత మంది శరీరంలో స్వతఃసిద్ధంగా 19-నోరానడ్రోస్టెనెడియోన్ ఉత్పత్తి అవుతుందని, డోపింగ్ పరీక్షలో అతను మాదక ద్రవ్యాన్ని వాడినట్టు రుజువు చేయడానికి అనుసరించిన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అంశాలను తెలియచేయాలని కుశాల్ తరఫు లాయర్లు చేసిన విజ్ఞప్తిపై ఐసిసి సానుకూలంగా స్పందించింది. కతార్ ల్యాబ్‌ను వివరాలు పంపాల్సిందిగా కోరింది. అయితే, నివేదిక అందించడానికి పదేపదే వాయిదాలు కోరిన కతార్ ల్యాబ్ చివరికి కుశాల్‌పై గతంలో వ్యక్తం చేసిన అనుమానాలను ఉపసంహరించుంది. దీనితో ఐసిసి అతనికి క్లీన్‌చిట్ ఇచ్చింది. డోపింగ్ కేసు ముగిసినట్టు ప్రకటించింది. కుశాల్ ప్రాక్టీస్‌ను ఆరంభించవచ్చని, లంక జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించవచ్చని తెలిపింది.
మళ్లీ జట్టులోకి వస్తా: కుశాల్
కొలంబో: తనపై వచ్చిన డోపింగ్ ఆరోపణలు సత్యదూరమని తేలడం ఎంతో సంతోషాన్నిస్తున్నదని కుశాల్ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. మళ్లీ జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. తాను ఉత్ప్రేరకాలను వాడలేదని స్పష్టం చేశాడు. కతార్ ల్యాబ్‌లో పొరపాటు జరిగినట్టు ఇప్పుడు రుజువైందని పేర్కొన్నాడు.
పరిహారం చెల్లించాల్సిందే..
కతార్‌లోని వాడా ల్యాబ్‌లో పొరపాటు జరిగింది కాబట్టి కుశాల్‌కు నష్టపరిహారం ఇచ్చి తీరాలని లంక క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తున్నది. అయతే, అది సాధ్యం కాదని, నిబంధనల్లోనూ ఇలాంటి సదుపాయం లేదని ఐసిసి తేల్చిచెప్పింది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి విచారణ చేపట్టామని, దోషులకు శిక్ష తప్పదని పేర్కొంది. అయతే, కుశాల్‌కు నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్‌లో అర్థం లేదని స్పష్టం చేసింది.