క్రీడాభూమి

డోప్ దోషులకుస్థానం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 18: డోప్ దోషులకు రియో ఒలింపిక్స్‌లో స్థానం లేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పష్టం చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 31 మంది డోపింగ్ పరీక్షలో పట్టుబడినట్టు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) చేసిన ప్రకటనపై అతను స్పందిస్తూ నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అన్నాడు. ఒలింపిక్స్ ఆశయానికి, స్ఫూర్తికి విఘాతం కలిగించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. ఆరు వేర్వేరు క్రీడా విభాగాల్లో పోటీపడిన 12 దేశాలకు చెందిన 31 మంది అథ్లెట్లను వాడా డోపింగ్ దోషులుగా గుర్తించడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నాడు. విజయాలను సాధించేందుకు అడ్డదారులను ఎంచుకున్న కొంత మంది ఉత్ప్రేరకాలను వాడుతున్నారని బాచ్ అన్నాడు. రియో ఒలింపిక్స్‌లో అలాంటి వారిని ఏరివేస్తామని అన్నాడు.

మైనేనికి నిరాశే
పారిస్, మే 18: రొలాండ్ గారోస్ కోర్టుల్లో ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో పాల్గొనాలన్న భారత ఆటగాడు సాకేత్ మైనేనీకి నిరాశ తప్పలేదు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో అమెరికాకు చెందిన ఫ్రానె్సస్ తియాఫోను ఢీకొన్న ఈ తెలుగు వీరుడు 6-7, 5-7 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఫలితంగా ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విభాగంలో భారత్‌కు ప్రాతినిథ్యం లేకుండాపోయింది.