క్రీడాభూమి

ఉబెర్ కప్ బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్ క్వార్టర్స్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కున్హాన్ (చైనా), మే 18: ఉబెర్ కప్ మహిళల టీం చాంపియన్‌షిప్ బాడ్మింటన్ టోర్నీలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరగా, పురుషుల విభాగంలో థామస్ కప్ కోసం జరుగుతున్న పోరులో భారత్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసి నిష్క్రమించింది. బుధవారం నాటి పోటీల్లో భారత మహిళల జట్టు కూడా ఓటమిపాలైంది. అయితే, అంతకు ముందు వరుసగా రెండు విజయాలను సాధించడంతో క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. జపాన్‌ను ఢీకొన్న భారత మహిళలు 2-3 తేడాతో పరాజయాన్ని చవిచూశారు. హైదరాబాదీలు సైనా నెహ్వాల్, పివి సింధు సింగిల్స్ మ్యాచ్‌ల్లో వరుస సెట్ల విజయాలను నమోదు చేశారు. అయితే, డబుల్స్ విభాగంలో విఫలమైన భారత్‌కు ఓటమి తప్పలేదు. లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ 21-18, 21-6 తేడాతో ప్రపంచ ఐదో ర్యాంక్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరాను చిత్తుచేసింది. నిరుడు దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్‌లో ఒకుహరా చేతిలో ఓడిన సైనా ఈసారి ప్రతీకారం తీర్చుకుంది. పివి సింధు 21-11, 21-18 స్కోరుతో ప్రపంచ 11వ ర్యాంకర్ అకానే యుమాగుచీపై గెలిచింది. ఈ రెండు విజయాలతో భారత్‌కు జపాన్‌పై 2-0 ఆధిక్యం లభించింది. అయితే, తొలి డబుల్స్‌లో జ్వాలా గుత్తా, సిక్కీ రెడ్డి జోడీ 11-21, 8-21 తేడాతో మిసాకీ మత్సుతొమో, అయాకా తకహషి జోడీ చేతిలో ఓడింది. మూడో సింగిల్స్‌లో రుత్విక శివానీ 11-21, 8-21 తేడాతో ప్రపంచ 12వ ర్యాంక్ క్రీడాకారిణి సయాకా సాతో చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. దీనితో జపాన్ 2-2గా స్కోరును సమం చేయగలిగింది. కీలకమైన చివరి డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప, సింధు పోటీపడాడరు. వీరు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ షిజుకా మత్సువో, మమీ నైటో 15-21, 21-16, 21-19 ఆధిక్యంతో గెలుపొంది, జపాన్‌కు 3-2 తేడాతో జపాన్‌కు విజయాన్ని అందించారు. కాగా, గ్రూప్ ‘డి’ నుంచి పోటీపడిన భా రత్ 5-0 తేడాతో ఆస్ట్రేలియాను, అదే తేడాతో జర్మనీని ఓడించి, బుధవారం మ్యాచ్‌లు ముగిసే సమయానికి రెండో స్థానంలో నిలిచి, క్వార్టర్స్‌కు అర్హత సంపాదించింది.
థామస్ కప్ పోటీల్లో భారత్ వరుసగా మూడో పరాజయాన్ని చవి చూసింది. ఇంతకు ముందు థాయిలాండ్ చేతిలో 2-3 తేడాతో ఓడిన భారత్ రెండో పోటీలో హాంకాంగ్ చేతిలోనే అదే తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఆ రెండు మ్యాచ్‌ల్లో కొద్దోగొప్పో ప్రతిఘటించిన భారత క్రీడాకారులు టోర్నీ నుంచి నిష్క్రమించామన్నది ఖరారు కావడంతో నీరసపడిపోయారు. ఫలితంగా ఇండోనేషియాను బుధవారం ఢీకొన్నప్పుడు 0-5 తేడాతో చిత్తయ్యారు. సింగిల్స్ విభాగంలో సాయి ప్రణీత్‌పై గిన్టింగ్ ఆంథోనీ 18-21, 21-11, 21-15 తేడాతో, సౌరభ్ వర్మపై ఇషా వౌలానా ముస్త్ఫో 21-10, 20-22, 21-13 తేడాతో, అజయ్ జయరామ్‌పై క్రిస్టీ జొనథాన్ 21-14, 21-12 తేడాతో విజయాలను నమోదు చేశారు. డబుల్స్ విభాగంలో మనూ అత్రి, అక్షయ్ దివాల్కర్ జోడీని ఆన్గా ప్రతమా, రికీ కరాన్డా సువార్డీ జోడీ 21-18, 21-17, సుమీత్ రెడ్డి, సాత్విక్ సాయిరాజ్ జోడీని గిడెన్ మార్కస్ ఫెర్నాల్డీ, హెండ్రా సెతియవాన్ జోడీ 21-9, 21-18 తేడాతో ఓడించాయి. దీనితో ఇండోనేషియా తిరుగులేని విధంగా 5-0 తేడాతో విజయభేరి మోగించగా, భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

నొజోమీ
ఒకుహరాను
చిత్తుచేసిన
సైనా