క్రీడాభూమి

షరపోవాపై నాలుగేళ్లు నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 18: రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవాను నాలుగు సంవత్సరాలు నిషేధిస్తున్నట్టు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది. ఆమె నిషిద్ధ ద్రవ్యమైన మెల్డోనియంను వాడినట్టు డోపింగ్ పరీక్షలో వెల్లడైన విషయం తెలిసిందే. ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) కంటే ముందే ఉత్ప్రేరకం వాడిన విషయాన్ని షరపోవా విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె స్వయంగా నేరాన్ని అంగీకరించగా, టెన్నిస్ సమాఖ్య ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత ఆమెను నాలుగేళ్లపాటు టెన్నిస్ నుంచి నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.

బిసిసిఐ సమావేశానికి
పవార్ దూరం
ముంబయి, మే 18: శశాంక్ మనోహర్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఈనెల 22న జరిగే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి మరాఠా రాజకీయ యోధుడు, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ హాజరుకావడం లేదు. ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉంటాడు. అందుకే ఈ సమావేశానికి హాజరుకావడం లేదు. ఇలావుంటే, బోర్డులో రాజకీయ నాయకు జోక్యాన్ని తగ్గించాలని, పాలక మండలి సభ్యులకు వయోపరిమితిని విధించాలని లోధా కమిటీ చేసిన సిఫార్సులపై సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో, కీలక సమావేశానికి పవార్ హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుప్రీం కోర్టు తప్పనిసరిగా లోధా కమిటీ సిఫార్సులను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించే అవకాశాలున్నాయని పవార్ సహా చాలా మంది వృద్ధ నేతల అనుమానం. 75 ఏళ్లు నిండిన వారు ఎవరూ బిసిసిఐ, దాని అనుబంధ సంఘాల పాలక మండళ్లలో సభ్యులుగా ఉండరాదన్నది లోధా కమిటీ సిఫార్సుల్లో ఒకటి. పవార్ వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు. అందుకే, అతను సాధ్యమైనం వరకూ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలని నిర్ణయంచుకున్నట్టు తెలుస్తోంది. కాగా, కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారన్న అంశం ఉత్కంఠను సృష్టిస్తోంది.