క్రీడాభూమి

అది భయానక బౌన్సర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 18: ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ వేసిన బంతి ధాటికి హెల్మెట్ ఎగిరి పడినప్పటికీ గాయం కాకుండా తప్పించుకోవడం తన అదృష్టమని రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ బ్యాట్స్‌మన్ జార్జి బెయిలీ వ్యాఖ్యానించాడు. అది భయానకమైన బౌన్సరనీ, ఒక ట్రక్కు వేగంగా వచ్చి గుద్దుకున్నట్టు అనిపించిందని ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ చెప్పాడు. బంతి తాను ఊహించిన దానికంటే వేగంగా దూసుకొచ్చిందని, అది తన ముఖానికే తగిలిందని అనుకున్నానని బెయిలీ చెప్పాడు. కౌల్టర్ నైల్ వేసిన ఆ బంతి ధాటికి బెయిలీ పెట్టుకున్న హెల్మెట్ కింద పడింది. డేర్‌డెవిల్స్ ఫీల్డర్లు కొంత మంది అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే, హెల్మెట్ స్టంప్స్ మీద పడలేదని ఒకరిద్దరు ఆటగాళ్లు నిరాశ చెంది ఉంటారని బెయిలీ చమత్కరించాడు.