క్రీడాభూమి

ధావన్‌కు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింహామ్, జూన్ 11: భారత స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఎడమ బొటనవేలికి గాయమైంది. దీనితో అతను ప్రపంచ కప్‌లో భారత్ ఆడాల్సిన మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం అనుమానంగానే కనిపిస్తున్నది. అతనికి కనీసం నెల రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టన్ నైల్ వేసిన బంతి అత్యంత వేగంగా దూసుకొచ్చి, ధావన్ ఎడమ బొటనవేలికి తగిలింది. ఫిజియోథెరపిస్టు పాట్రిక్ ఫర్హత్, ఇతర సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్సను అందించారు. అనంతరం తీవ్రమైన నొప్పితోనే బ్యాటింగ్‌ను కొనసాగించిన ధావన్ 109 బంతుల్లో 117 పరుగులు సాధించి, డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌పై భారత్ విజయం సాధించడంలో ప్రముఖ భూమికను పోషించిన విషయం తెలిసిందే. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ధావన్ ఫీల్డింగ్‌కు రాలేదు. అతని స్థానంలో రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌కు దిగాడు. ఇలావుంటే, గురువారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కి ధావన్ అందుబాటులో ఉండదు. అతని స్థానాన్ని అందిపుచ్చుకోవడానికి స్టాండ్‌బైస్ రిషభ్ పంత్, అంబటి రాయుడు పోటీపడుతున్నారు. అయితే, జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం టీమ్ ‘ఏ’ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లాండ్‌లోనే ఉండడం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు లాభించవచ్చు. కాగా, థావన్ గాయాన్ని పరిశీలించిన వైద్యులు పరీక్షలు చేయించారు. అందులో, అతని ఎడమచేతి బొటనవేలుకు ఫ్రాక్చర్ అయినట్టు నిర్ధారించారు. ప్రస్తుతం వైద్య సేవలు పొందుతున్న ధావన్ కనీసం మూడు వారాలు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందని అనధికార సమాచారం. అయితే, జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం ఈ అంశంపై ఇంకా ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం నిజమైతే, జూలై 14వ తేదీతో ముగిస్తే సరి, లేదంటే వరల్డ్ కప్‌లో మిగతా మ్యాచ్‌లకు ధావన్ దూరం కావచ్చు.
చిత్రం... శిఖర్ ధావన్‌కు ప్రాథమిక చికిత్స చేస్తున్న ఫిజియోథెరపిస్టు పాట్రిక్ ఫర్హత్