క్రీడాభూమి

అర్మాటొవిచ్ డబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూరో 2020 గ్రూప్ ‘జీ’ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా స్కోపీలోని నేషనల్ ఎరెనా టాడర్ ప్రొస్కీ స్టేడియంలో ఉత్తర మెసెడోనియాపై రెండు గోల్స్ చేసి, ఆస్ట్రియాను గెలిపించిన స్టార్ ఆటగాడు మార్కో అర్మాటొవిచ్‌కు సహచరుల అభినందన. మ్యాచ్ 62, 82 నిమిషాల్లో అతను గోల్స్ చేశాడు. మ్యాచ్ ప్రారంభంలోనే ఆస్ట్రియా ఆటగాడు మార్టిన్ హినె్టరెగెర్ ఓన్ గోల్ చేయడంతో ఉత్తర మెసెడోనియాకు 1-0 ఆధిక్యం లభించింది. 39వ నిమిషంలో వలెన్షియో లాజరో ఆస్ట్రియాకు ఈక్వెలైజర్‌ను అందించాడు. అనంతరం అర్మాటొవిచ్ రెండు గోల్స్ చేయగా, చివరిలో ఉత్తర మెసెడోనియా ఆటగాడు ఎగ్జాన్ బెజ్‌టులై చేసిన ఓన్ గోల్‌తో ఆస్ట్రియా ఆధిక్యం 4-1కి చేరింది. అదే తేడాతో ఆ జట్టు మ్యాచ్‌ని ముగించింది.