క్రీడాభూమి

రెండో స్థానంలోనే నాదల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 11: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టైటిల్‌ను 12వ పర్యాయం చేజిక్కించుకొని, సరికొత్త చరిత్ర సృష్టించినప్పటికీ రాఫెల్ నాదల్ ప్రపంచ ర్యాంకింగ్ ఏమాత్రం మారలేదు. ప్రపంచ టెన్నిస్ సమాఖ్య గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అతను రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 12,715 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, రెండో స్థానంలో ఉన్న నాదల్ ఖాతాలో 7,945 పాయింట్లు ఉన్నాయి. స్విట్జర్లాండ్ సీనియర్ ఆటగాడు రోజర్ ఫెదరర్ 6,670 పాయింట్లు సంపాదించి మూడో స్థానంలో నిలిచాడు. పురుషుల ‘టాప్-10’ జాబితాలో వీరితోపాటు డామినిక్ థీమ్ (4,686 పాయింట్లు/ నాలుగో స్థానం), అలెగ్జాండర్ జ్వెరెవ్ (4,360 పాయింట్లు/ ఐదో స్థానం), స్ట్ఫోనొన్ సిసిపాస్ (4,215 పాయింట్లు), ఆరో స్థానం), కెయ్ నిషికొరి (4,040 పాయింట్లు/ ఏడో స్థానం), కెవిన్ ఆండర్సన్ (3,565 పాయింట్లు/ ఎనిమిదో స్థానం), కరెన్ ఖచనొవ్ (2,980 పాయింట్లు/ తొమ్మదో స్థానం), ఫాబియో ఫోగ్నినీ (2,785 పాయింట్లు/ పదో స్థానం) చోటు సంపాదించారు.