క్రీడాభూమి

ప్రపంచ మహిళల బాక్సింగ్ రెండో రౌండ్‌కు కోమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్టానా (కజకస్థాన్), మే 19: ఇక్కడ జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ మేరీ కోమ్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. 51 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఆమె 3-0 తేడాతో స్వీడన్‌కు చెందిన జూలియానా సొడెర్‌స్ట్రామ్‌పై గెలిచింది. తర్వాతి రౌండ్‌లో ఆమె జర్మనీ బాక్సర్ అజీజె నిమానీతో తలపడుతుంది. అజీజె తన తొలి రౌండ్ ఫైట్‌లో మంగోలియాకు చెందిన ఆసియా గేమ్స్ కాంస్య పతక విజేత నాడిన్‌స్టెన్‌సెగ్ మాగ్మారులమ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. వివాదాస్పద బాక్సర్‌గా ముద్ర పడిన సరితా దేవి కూడా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. 60 కిలోల విభాగంలో పోటీపడుతున్న ఆమె మొదటి రౌండ్‌లో విక్టోరియా టోరెస్ (జర్మనీ)పై గెలిచింది.