క్రీడాభూమి

లంక, బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షార్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్టల్, జూన్ 11: శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య మంగళవారం జరగాల్సిన ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో క్రమం తప్పకుండా పిచ్‌ని పరిశీలిస్తూ వచ్చారు. జల్లులు ఒక్కోసారి తగ్గినప్పటికీ, మళ్లీ పునరావృతం కావడంతో ఔట్ ఫీల్డ్ మొత్తం బురదమయమైంది. పిచ్‌ని కవర్లతో కప్పి ఉంచిన గ్రౌండ్స్‌మెన్, నీటిని ఎప్పటికప్పుడు తొలగించారు. కనీసం చెరి 20 ఓవర్ల ఆటైనా జరుగుతుందని అభిమానులు ఆశించినప్పటికీ ఫలితం లేకపోయింది. వారు ఎంత కష్టపడినా, మైదానం ఆటకు అనువుగా లేకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఇలావుంటే, మ్యాచ్ కోసం సర్వసన్నద్ధమై, తీరా మైదానంలోకి దిగే సమయంలో వర్షం కారణంగా ఆట రద్దుకావడం తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుందని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫ్ మొర్తాజా వ్యాఖ్యానించాడు. ఏ జట్టుకైనా ఇలాంటి పరిస్థితి చికాకు తెప్పిస్తుందని అన్నాడు. తమ జట్టు ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఫిట్నెస్ సమస్య నుంచి కోలుకుంటున్నాడని, నాలుగైదు రోజుల్లో అతను ఆటకు సిద్ధంగా ఉంటాడని చెప్పాడు. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే మాట్లాడుతూ తమ జట్టు వర్షం కారణంగా ఎంతో నష్టపోయిందని వాపోయాడు. ఆడాల్సిన మ్యాచ్‌లు రద్దుకావడంతో, మిగతా మ్యాచ్‌ల్లో ఒత్తిడి పెరుగుతుందని అన్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు కావడం దురదృష్టరమని వ్యాఖ్యానించాడు. అంపైర్లు ఇల్లింగ్‌వర్త్, కెటిల్‌బరో మాట్లాడుతూ ఆటను కొనసాగించేందుకు చివరి క్షణం వరకూ వేచి చూశామని అన్నారు. ఓవర్లను కుదించి, మ్యాచ్‌ని ఆడించాలకున్నా ఫలితం లేకపోయిందన్నారు. కనీస ఓవర్లు ఆడే అవకాశం కూడా లేకపోవడంతో, మ్యాచ్‌ని రద్దు చేయక తప్పలేదని అన్నారు. బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ మైదానం ప్రస్తుతం ఆటకు ఎంత మాత్రం అనువుగా లేదన్నారు.

వెంటాడుతోంది..

ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను, ప్రత్యేకించి శ్రీలంక జట్టును వర్షం వెంటాడుతున్నది. ఈసారి ప్రపంచ కప్‌లో తన తొలి మ్యాచ్‌ని న్యూజిలాండ్‌తో ఆడిన శ్రీలంక 10 వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆతర్వాత అఫ్గానిస్తాన్‌తో కార్డ్ఫిలోని సోఫియా గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌కి వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. అయితే, ఆతర్వాత ఆటను కొనసాగిం చి, డక్‌వర్డ్ లూయిస్ విధానాన్ని అమలు చేశారు. ఆ మ్యాచ్‌ని లంక 34 పరుగుల తేడాతో గెల్చుకుం ది. బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకావడంతో, లంక పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది.
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్ వర్షం వల్ల నిలిచిపోయింది. ఇరు జట్లు చెరొక పాయింట్‌ను పంచుకున్నాయి.
వరల్డ్‌కప్‌లో మూడు మ్యాచులు రద్దు కావడం ఇదే మొదటిసారి.
నేటి గ్రూప్ మ్యాచ్ డౌటే..

టౌన్టన్‌లో బుధవారం కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. మంగళవారం నాటి మ్యాచ్ కొనసాగే అవకాశాలు 80 శాతం ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ, బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్ రద్దయింది. బుధవారం నాటి మ్యాచ్ జరిగే అవకాశాలు 40 శాతం మాత్రమేనని వాతావరణ శాఖ పేర్కొంది. దీనితో అసలు మ్యాచ్ జరుగుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

చిత్రం... కవర్లతో కప్పి ఉంచిన బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ పిచ్